మరోసారి 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు.. క్లారిటీ ఇచ్చిన మాదాల రవి | Madala Ravi Gives Clarity On Manchu Vishnu Again As MAA President, Details Inside - Sakshi
Sakshi News home page

MAA President: మరోసారి 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు.. క్లారిటీ ఇచ్చిన మాదాల రవి

Apr 8 2024 7:13 AM | Updated on Apr 8 2024 9:58 AM

Clarified Madala Ravi Again Manchu Vishnu MAA President - Sakshi

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌(మా) అధ్యక్షునిగా మంచు విష్ణునే మరోసారి కొనసాగించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి ప్రకటించారు. 2021 లో జరిగిన ‘మా’ ఎన్నికలలో మంచు విష్ణు మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. వాస్తవంగా ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరగాల్సిన 'మా అసోసియేషన్ ఎన్నికలు'  ఈసారి మాత్రం ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును ప్రకటించారంటూ వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని తాజాగా మాదాల రవి ప్రకటించారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడిగా మంచు విష్ణు పదవి కాలం ఇప్పటికే ముగిసిపోయింది. అయినా కూడా విష్ణునే ఇన్నాళ్లు అధ్యక్షుడిగా ఉంటూ వచ్చారు. ‘మా’కు ఎప్పుడో ఎన్నికలు జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల జాప్యం ఏర్పడింది.

మా అసోసియేషన్ ఫండ్ రైజింగ్ కోసం జూలై లో మారిషస్‌లో ఒక ఈవెంట్‌ అయితే జరుగుతుంది. ఇదే విషయాన్ని మంచు విష్ణు కూడా గతంలో ప్రకటించారు.  ఆ కార్యక్రమం ద్వారా వచ్చే డబ్బును మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ కోసం ఉపయోగిస్తామని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యుక్షుడిగా మంచు విష్ణు ఏమైనా స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement