‘ఆచార్య’ అదిరిపోయే వీడియో.. చెర్రీ ఎమోషనల్‌ పోస్ట్‌

Chiranjeevi Birthday: Ram Charan Released Acharya Team Special Video - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డే(ఆగస్ట్‌ 22) నేడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మెగాస్టార్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తున్న, నటించబోతున్న సినిమాల నుంచి వరుస అప్‌డేట్స్‌ వస్తున్నాయి. ఇప్పటికీ చిరు 154 చిత్రంటైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదలై సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రానికి ‘బోళా శంకర్‌’అని పేరు ఖరారు చేశారు. ఇక తాజాగా ‘ఆచార్య’టీమ్‌ స్పెషల్‌ వీడియోలో చిరంజీవికి బర్త్‌డే విషెస్‌ తెలియజేసింది. 

(చదవండి: చిరు బర్త్‌డే సర్‌ప్రైజ్‌ వచ్చేసింది..‘భోళా శంకర్‌’గా మెగాస్టార్‌)

రామ్ చ‌ర‌ణ్ త‌న తండ్రితో క‌లిసి ఆచార్య సెట్‌లో గ‌డిపిన సంద‌ర్భాల‌కు సంబంధించి ఈ స్పెష‌ల్ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అందులో ఆచార్య షూట్‌ కోసం తన తండ్రి చిరంజీవిని కారులో స్వయంగా డ్రైవింగ్‌ చేసుకుంటూ తీసుకెళ్లాడు రామ్‌ చరణ్‌.  ఆ త‌ర్వాత సెట్‌లో తండ్రితో క‌లిసి సందడి చేశాడు. ఈ వీడియోని చెర్రీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘మై అప్పా.. మై ఆచార్య’ అంటూ తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. 

ఇక ఆచార్య సినిమా విషయానికొస్తే..  కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నిరంజన్‌  రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. చెర్రి ఈ సినిమాను నిర్మించడంతో పాటు సిద్ధ అనే ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
చరణ్ సరసన పూజాహెగ్డే కనిపించనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top