
విక్కీ కౌశల్,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’(Chhaava Movie). ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైన ఈ చిత్రం తొలిరోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ని సంపాదించుంది. మూడు వారాల తర్వాత నిన్న (మార్చి 7) ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో విడుదల చేసింది. టాలీవుడ్‌లో కూడా ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. విక్కీ కౌశల్ నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫలితంగా ఈ చిత్రం తొలి రోజు మంచి కలెక్షన్లలే రాబట్టింది.
(ఛావా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
రెండు తెలుగు రాష్ట్రాలలో కలిసి తొలి రోజు 3.03 కోట్ల రూపాయలను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఓ డబ్బింగ్ సినిమాకు ఫస్ట్‌డే ఈ స్థాయి కలెక్షన్స్ రావడం రికార్డే అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్‌లో మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఇప్పటి వరకు రూ. 483.58 కోట్లను రాబట్టింది.
ఛావా విషయానికొస్తే.. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. శంభాజీ పాత్రలో విక్కీ నటించగా.. ఆయన భార్య ఏసుబాయి పాత్రను రష్మిక పోషించింది. ఇక బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా..ఔరంగాజేబు పాత్రలో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.