Buzz: SJ Suryah To Play Villain In Kamal Haasan's 'Indian 2' - Sakshi
Sakshi News home page

గుసగుస.. 'ఇండియన్‌-2'లో విలన్‌గా ఎస్‌.జె. సూర్య!

Jun 7 2023 7:49 AM | Updated on Jun 7 2023 10:34 AM

Buzz: SJ Surya As The Villain Of Kamal Haasan Indian 2 - Sakshi

ఎస్‌.జె. సూర్యలో దర్శకుడు (తెలుగులో ‘ఖుషి నాని, పులి’), హీరో (తమిళంలో పలు చిత్రాలు), విలన్‌ (తెలుగు ‘స్పైడర్‌’) ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు మూడు చిత్రాల్లో విలన్‌గా నటిస్తున్నారు సూర్య. వాటిలో శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా రూపొందుతున్న ‘గేమ్‌ చేంజర్‌’ ఒకటి. మరొకటి ‘ఇండియన్‌ 2’ అని సమాచారం.

అయితే ‘ఇండియన్‌ 2’ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఇండియన్‌ 2’. 1996లో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్‌’ సినిమాకు ఇది సీక్వెల్‌. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌ సింగ్, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్‌ చెన్నైలో ముగిసింది. కాగా నెక్ట్స్‌ షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్‌ చేసింది చిత్రయూనిట్‌. దాదాపు పది రోజుల పాటు ఈ షెడ్యూల్‌ జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement