నారాయణ మూర్తి ప్రజా దర్శకుడు

Brahmanandam unveils logo of R Narayana Murthy University - Sakshi

– బ్రహ్మానందం

‘‘ఇండస్ట్రీలో కళా దర్శకులు, వ్యాపారాత్మక దర్శకులు ఉన్నారు. కానీ, ప్రజా దర్శకుడు అంటే ఆర్‌. నారాయణ మూర్తి ఒక్కరే. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటు పడే వ్యక్తి ఆయన’’ అన్నారు ప్రముఖ నటుడు బ్రహ్మానందం. ఆర్‌. నారాయణ మూర్తి లీడ్‌ రోల్‌లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’.

ఈ సినిమా టైటిల్‌ లోగోని బ్రహ్మానందం రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ– ‘‘ఎడ్యుకేషన్‌ మాఫియా, విద్యా వ్యవస్థ లోని లోపాలతో నారాయణ మూర్తిగారు తీసిన ఈ చిత్రాన్ని ఆదరించాలని ప్రేక్షకులను, నా ఫ్యాన్స్‌ని కోరుతున్నాను’’ అన్నారు. ఆర్‌. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘వైజాగ్‌ సత్యానంద్‌ గారి శిష్యులు ఈ సినిమాలో నటించారు. భారతదేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో ‘యూనివర్సిటీ’ తీశాను. విద్య, వైద్యం ప్రైవేట్‌ పరం కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలి. విజయనగరం పార్లకిమిడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాను.. నాకు సహకరించిన మంత్రి బొత్స సత్యనారాయణగారికి, ఇతరులకు థ్యాంక్స్‌’’ అన్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top