Pawan Kalyan Bheemla Nayak Brahmanandam Poster - Sakshi
Sakshi News home page

Bheemla Nayak Movie: భీమ్లా నాయక్‌లో బ్రహ్మానందం.. పోస్టర్ విడుదల

Dec 8 2021 7:53 AM | Updated on Dec 8 2021 8:16 AM

Brahmanandam Look Poster Out From Bheemla Nayak Movie - Sakshi

Brahmanandam Look Poster Out From Bheemla Nayak Movie: బ్రహ్మానందం అంటే ఓ చక్కిలిగింతలు. కడుపుబ్బ నవ్వించే కమెడియన్‌. అనేక చిత్రాల్లో నటించిన ఆయన యాక్టింగ్‌, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను నవ్వులు పూయించారు. తెలుగు తెరపై చెరగని చిరునవ్వును శాశ్వతంగా ఉంచిన కామెడి కింగ్‌లలో బ్రహ్మానందం ఒకరు. ఆయన నటించిన చిత్రాల‍్లోని సీన్‌లు, హావభావాలను ఇప్పటికీ మీమ్స్‌ రూపంలో వాడుతున్నారంటే ఆయన ఎంతలా నవ్వించారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అరకొర చిత్రాల్లో నటిస‍్తున్న బ్రహ‍్మానందం పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ 'భీమ్లా నాయక్‌'లో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని బ్రహ్మానందం లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 

ఇందులో బ్రహ్మీ పోలీసు పాత‍్రలో నటిస్తున్నారు. బీమ్లా నాయక్‌లో బ్రహ్మానందం నటిస్తున‍్నారంటే యాక్షన్‌, డైలాగ్స్‌తోపాటు కామెడీ కూడా అదిరిపోద్దనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం నటించడం విశేషంగా మారింది. అయితే బ్రహ్మీ కామెడీ ఏమేరకు పండుద్దో సినిమా విడుదలయ్యేవరకూ ఆగాల్సిందే. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భీమ్లా నాయక్‌ చిత్రం జనవరి 12, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహించగా, మాటల మాంత్రికుడు డైలాగ్స్‌ రాస్తున్నారు. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన 'అయ్యప‍్పనుమ్‌ కోషీయమ్‌' చిత్రానికి ఇది రీమేక్‌. 

Advertisement
 
Advertisement
Advertisement