ప్రపంచంలో నెపోటిజమ్‌ లేనిది ఎక్కడ? : బాలీవుడ్‌ హీరోయిన్‌ | Bollywood Heroine Aditi Rao Hydari Talks About Nepotism | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో నెపోటిజమ్‌ లేనిది ఎక్కడ? : బాలీవుడ్‌ హీరోయిన్

Mar 13 2021 8:26 AM | Updated on Mar 13 2021 8:26 AM

Bollywood Heroine Aditi Rao Hydari Talks About Nepotism - Sakshi

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఒక రంగంలోకి అడుగుపెట్టి, పైకి రావడం అనేది చిన్న విషయం కాదు. సొంత నిర్ణయాలు తీసుకోవాలి, తప్పొప్పుల మీద అవగాహన ఉండాలి. అదే వారసులకు అయితే గైడ్‌ చేయడానికి చాలామంది ఉంటారు. సినిమా పరిశ్రమలో వారసత్వం గురించి పలు సందర్భాల్లో బ్యాక్‌గ్రౌండ్‌ లేనివాళ్లు మాట్లాడారు. వారసులకు అవకాశాలు సులువుగా వస్తాయని, వారికి ఇచ్చే మర్యాదలు వేరేగా ఉంటాయని బాహాటంగానే కొందరు అన్నారు. ‘నెపోటిజమ్‌’ (బంధుప్రీతి) గురించి కథానాయిక అదితీరావ్‌ హైదరీ మాట్లాడుతూ –‘‘నా దృష్టిలో నెపోటిజటమ్‌ అనేది చెడ్డ పదం. అసలు ప్రపంచంలో నెపోటిజమ్‌ లేనిది ఎక్కడ? అయితే దీన్ని నేను విమర్శించడంలేదు. 

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని నాకు ఎవరి గురించీ ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకునే ఛాన్స్‌ దక్కింది. బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవారికి అవకాశాలు సులువుగా వస్తాయి. కానీ ఈ విషయంలో నాకెలాంటి కోపం లేదు. నా ఎదుగుదల నా శక్తిని తెలియజేస్తుంది. నేను కలలు కనడానికి ఇష్టపడతాను. వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతేకానీ ఇతరుల గురించి చెడుగా ఆలోచించను. నా ప్రతి నిర్ణయం నాకు శక్తినివ్వడంతో పాటు, నిర్భయంగా ముందుకు సాగేలా చేస్తోంది’’ అన్నారు. తెలుగులో ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’, ‘వి’ వంటి చిత్రాల్లో నటించిన అదితీ రావ్‌ ప్రస్తుతం శర్వానంద్, సిద్ధార్థ్‌ కాంబినేషన్లో‌ రూపొందుతోన్న ‘మహాసముద్రం’లో కథానాయికగా నటిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement