రేవంత్‌ చెత్త సంచాలక్‌, రోహిత్‌కు తీవ్ర అన్యాయం | Bigg Boss Telugu 6: Big Fight With Revanth and Rohit | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: చెత్త సంచాలక్‌, రూల్స్‌ బ్రేక్‌ చేసినా పట్టించుకోని రేవంత్‌

Nov 11 2022 12:16 AM | Updated on Nov 11 2022 12:16 AM

Bigg Boss Telugu 6: Big Fight With Revanth and Rohit - Sakshi

దీంతో శ్రీసత్య మధ్యలో నీకిష్టం వచ్చినట్లు ఎలా పెడతావని ఆగ్రహించింది. సంచాలక్‌గా నా ఇష్టం వచ్చిందే చేస్తానని తెగేసి చెప్పాడతడు.

Bigg Boss Telugu 6, Episode 68: నిన్నటి ఎపిసోడ్‌లో కెప్టెన్సీ కంటెండర్‌గా తన స్థానంలో శ్రీసత్యను సెలక్ట్‌ చేశాడు శ్రీహాన్‌. హౌస్‌మేట్స్‌ అందరూ తనను టార్గెట్‌ చేయడంతో డీప్‌గా హర్టయ్యాడు రేవంత్‌. మరి ఈరోజు ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్‌ ఎలా జరిగింది? రేవంత్‌ తిరిగి నార్మల్‌ అయ్యాడా? అనేది చూద్దాం..

'గేమ్‌లో ఫిజికల్‌ అవకముందే అయ్యానని అన్నారు. అంత కష్టపడి ఆడితే నాకు ప్రతిఫలం దక్కలేదు. అసలు ఈ హౌస్‌కు రాకుండా ఉండాల్సింది, ఓడిపోయాను' అని బాధపడ్డాడు రేవంత్‌. మెరీనా అతడిని ఓదారుస్తూ కంటనీరు తుడవగా.. కెప్టెన్సీలో సపోర్ట్‌ కావాలంటే నీకు, కీర్తికి సాయం చేస్తానని మాటిచ్చాడు రేవంత్‌. ఇక శ్రీసత్య తినడానికి పిలిస్తే కూడా తనకు ఒంటరిగా ఉండాలనుందని ఆమెను దూరం పెట్టాడు. అర్ధరాత్రి భార్య ఫొటో చూస్తూ ఆమెనే తలుచుకున్న రేవంత్‌ బిగ్‌బాస్‌ గెలిచే ఇంటికి వస్తానని మరోమారు గట్టిగా మనసులో అనుకున్నాడు.

తర్వాతి రోజు కూడా రేవంత్‌ ముభావంగానే ఉన్నాడు. ఇంతలో బిగ్‌బాస్‌.. రేవంత్‌ను కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచి కెప్టెన్సీ టాస్క్‌ నిర్వహించమని చెప్పాడు. వస్తా నీ వెనుక అనే కెప్టెన్సీ టాస్క్‌లో శ్రీసత్య, ఫైమా, కీర్తి, ఆదిరెడ్డి, మెరీనా, రోహిత్‌ పోటీపడ్డారు. టాస్క్‌ మధ్యలో రకరకాల రూల్స్‌ పెట్టాడు రేవంత్‌. దీంతో శ్రీసత్య మధ్యలో నీకిష్టం వచ్చినట్లు ఎలా పెడతావని ఆగ్రహించింది. సంచాలక్‌గా నా ఇష్టం వచ్చిందే చేస్తానని తెగేసి చెప్పాడతడు.

అతడు పెట్టిన నియమాల్లో బ్యాగు చేత్తో పట్టుకోవద్దని కూడా ఉంది. దీంతో రోహిత్‌ బ్యాగు చేత్తో పట్టుకోలేదు. కానీ ఆదిరెడ్డి మాత్రం చేత్తో అదిమి పట్టుకుంటున్నా సంచాలక్‌ నోరెత్తలేదు. పైగా రోహిత్‌ అవుట్‌ అని చెప్పడంతో అతడు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అక్కడ ఆది.. చేత్తో పట్టుకుంటే కనిపించడం లేదా? అని ప్రశ్నించాడు. తన గోనెసంచిని కాలితో తన్ని ఫ్రస్టేషన్‌ తీర్చుకున్నాడు. అన్‌ఫెయిర్‌ అంటూ రేవంత్‌ మీద మండిపడ్డాడు. దీంతో అతడు వెళ్లి ఎక్కడ తప్పు జరిగిందని ఆరా తీశాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చెత్త సంచాలక్‌గా వ్యవహరించడం వల్ల పోటీదారులు తికమకపడాల్సి వచ్చింది. ఫైనల్‌గా ఈ టాస్క్‌లో ఫైమా కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది.

చదవండి: బికినీలో నిహారిక, టాటూ ఫొటోలు వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement