Bigg Boss 5 Telugu : మానస్‌తో పెళ్లి, గాల్లో తేలిన పింకీ, మధ్యలోకి అతడి తల్లి!

Bigg Boss Telugu 5: Maanas, Priyanka Best Compatible Couples - Sakshi

Bigg Boss Telugu 5, Episode 49: వీజే సన్నీ.. కాజల్‌ను రేషన్‌ మేనేజర్‌గా ఎన్నుకున్నాడు. తన కెప్టెన్సీని గతవారం ఎలిమినేట్‌ అయిన సెట్‌ శ్వేతకు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. అనంతరం బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు 'సరైన మ్యాచ్‌ను వెతకండి' అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో భాగంగా హౌస్‌లోని మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌ వారికి కాబోయే భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పాల్సి ఉంటుంది. ముందుగా శ్రీరామ్‌.. తనను పెళ్లాడే అమ్మాయి బబ్లీగా, దేన్నైనా అల్లుకుపోయేలా ఉండాలన్నాడు. సన్నీ.. నమ్మకం, నిజాయితీ, అర్థం చేసుకునే స్వభావం తనకు కాబోయే అమ్మాయిలో తప్పకుండా ఉండాలన్నాడు. ఎంతో కేరింగ్‌ చూపించే పింకీలాంటి అమ్మాయిని ఎవరు చేసుకున్నా అదృష్టవంతులేనని చెప్పుకొచ్చాడు.

నా గర్ల్‌ఫ్రెండ్‌ నన్నే చూడాలి: షణ్ముఖ్‌
మానస్‌ తను చేసుకోబోయే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్తూ.. 'నేను ఎక్కువ అలుగుతాను, అప్పుడు తనే ముందుగా నన్ను బుజ్జగించాలి. ఇద్దరి కుటుంబాలను ప్రేమగా చూసుకోవాలి' అని తెలిపాడు. అతడు మాట్లాడుతున్నంత సేపు ప్రియాంక తెగ సిగ్గుపడిపోవడం గమనార్హం. పింకీ వంతు వచ్చేసరికి.. 'అబ్బాయి నాకంటే ఎక్కువ హైట్‌ ఉండాలి. మంచివాడై ఉండాలి, అర్థం చేసుకోవాలి, వాళ్ల ఫ్యామిలీని నా ఫ్యామిలీలా చూసుకుంటాను, నా దగ్గర బోలెడంత ప్రేమ ఉంది, అది అతడికి ఇచ్చేస్తాను' అని చెప్పుకొచ్చింది. నా గర్ల్‌ఫ్రెండ్‌ నన్నే చూడాలి, ఇంకెవర్నీ చూడొద్దని షణ్ముఖ్‌. నా దగ్గర పొగరు చూపించొద్దని సిరి వారి అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. జెస్సీ మినహా మిగతా అందరూ పింకీ-మానస్‌ను బెస్ట్‌ కపుల్‌గా పేర్కొన్నారు. దీంతో బిగ్‌బాస్‌ వారిద్దరూ పూలదండలు మార్చుకునేలా చేసి పెళ్లి జరిపించేశాడు. అనంతరం వీళ్లిద్దరూ 'గువ్వా గోరికంతో..' పాటకు జంటగా స్టెప్పులేశారు.

రవి గేమ్‌ ఆడట్లేదు, మనతో ఆడుతున్నాడు
అయితే పింకీ మానస్‌ ధ్యాసలో పడి తన గేమ్‌ కూడా పట్టించుకోవట్లేదని భయపడిపోయింది యానీ. దీంతో రవి.. నాకు మానస్‌ మదర్‌ కూడా తెలుసు. ఆమె ఎలా రియాక్ట్‌ అవుతుందోనని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో 'బంగారు కోడిపెట్ట' టాస్క్‌లో సిరి స్టిక్కర్లు తానే తీశానని సీక్రెట్‌ బయటపెట్టాడు. దీంతో ప్రియ ఈ విషయాన్ని సిరి చెవిలో ఊదింది. కానీ తాను చెప్పానని మాత్రం ఎవరికీ చెప్పొద్దని సిరితో ఒట్టేయించుకుంది. ఇదిలా వుంటే రవి గేమ్‌ ఆడటానికి ప్రయత్నించట్లేదని, మనతో ఆడటానికి ట్రై చేస్తున్నాడని కాజల్‌తో గుసగుసలాడాడు షణ్ను. శ్రీరామ్‌ కూడా రవికి లొంగిపోయాడని, లోబో, విశ్వ రవి కోసమే ఆడుతున్నారని అభిప్రాయపడ్డాడు. మరోపక్క రవి.. తానే స్టిక్కర్లు తీశానని నేరుగా సిరితో చెప్పేశాడు.

అడ్డంగా దొరికిపోయిన రవి, ఏకిపారేసిన నాగ్‌
నాగార్జున.. ఈవారం వరస్ట్‌ పర్ఫామర్‌ ఎవరో చెప్పమని ఇంటిసభ్యులను ఆదేశించాడు. రేషన్‌ మేనేజర్‌గా ప్రియాంక సింగ్‌ ఫెయిలైందని రవి ఆమెను వరస్ట్‌ పర్ఫామర్‌గా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నాగ్‌.. సిరి స్టిక్కర్లు దొంగతనం చేయడం సరైందే కానీ అమ్మతోడు ఎందుకు వేశావని రవిని నిలదీశాడు. దీంతో అడ్డంగా దొరికిపోయిన రవి.. అది తప్పేనని ఒప్పుకుంటూనే కావాలని చేయలేదని బుకాయించాడు. తర్వాత షణ్ముఖ్‌.. సిరిని వరస్ట్‌ పర్ఫామర్‌ అని తెలిపాడు. సిరి.. కాజల్‌ను, విశ్వ.. టాస్క్‌ల్లో జీరో అంటూ ప్రియాంకను వరస్ట్‌ పర్ఫామర్లుగా సూచించారు. ప్రియాంక,  జెస్సీ, ప్రియ.. విశ్వను వరస్ట్‌ పర్ఫామర్‌గా పేర్కొన్నారు.

ఎన్నిసార్లు చెంప పగలగొడతావు?: నాగ్‌
చెంప పగలగొడతాను అని ఎన్నిసార్లు అంటావని ప్రియను నిలదీశాడు నాగ్‌. దీనికి వివరణ ఇచ్చేందుకు ప్రియ ప్రయత్నిస్తూ.. 'బుట్టలో ఎగ్స్‌ తీయబోతుంటే సన్నీ నన్ను నెట్టేయగా ముందుకు పడిపోయాను. అతడు నానా మాటలు అనడంతో నాతో ఫిజికల్‌ అయితే మాత్రం చెంప పగలగొడతాను అని తిట్టాను' అని ఒప్పుకుంది. మరీ అన్నిసార్లు తిట్టకని సుతిమెత్తగా హెచ్చరించాడు నాగ్‌. తర్వాత యానీ మాస్టర్‌.. జెస్సీని, శ్రీరామ్‌.. మానస్‌ను, కాజల్‌.. ప్రియను, మానస్‌.. షణ్ముఖ్‌ను వరస్ట్‌ పర్ఫామర్‌గా చెప్పుకొచ్చారు.

చెత్త ఆటగాడిగా ఎంపికైన విశ్వ
ఇక బంగారు కోడిపెట్ట టాస్క్‌లో సన్నీ గ్రూప్‌ సహాయం తీసుకుని ఆడినందుకు కెప్టెన్సీ రద్దైందని ప్రకటించి చిన్న ఝలుక్‌ ఇచ్చాడు నాగ్‌.  ఇండివిడ్యువల్‌ టాస్క్‌ అని రాసి ఉన్నా కూడా సన్నీ- కాజల్‌, మానస్‌- ప్రియాంక కలిసి ఆడారని, దానివల్ల తాను కెప్టెన్‌ కాలేకపోయానని ఎమోషనల్‌ అయింది యానీ..సన్నీ ధైర్యం చేసుకుని ప్రియను వరస్ట్‌ పర్ఫామర్‌ అని చెప్పాడు. దీంతో ప్రియ, సన్నీ ఒకరికొకరు గాల్లో ముద్దులు పంపుకున్నారు. ఇక మెజారిటీ సభ్యులు విశ్వను చెత్త ఆటగాడిగా పేర్కొనడంతో సోమవారం అతడిని జైల్లోకి పంపిస్తారని చెప్పాడు నాగ్‌. తర్వాత శ్రీరామ్‌ సేఫ్‌ అయినట్లు ప్రకటించాడు. 

కాజల్‌ లాంటి వాళ్లు నాకు నచ్చరు: లోబో
బిగ్‌బాస్‌ హౌస్‌ను శుభ్రంగా ఉంచుకోలేదని తిట్టిపోశాడు నాగ్‌. హౌస్‌ను ఎంత గలీజ్‌ చేశారో చూడండి అంటూ కంటెస్టెంట్లకు హౌస్‌నంతా వీడియోలో చూపించాడు. తర్వాత లోబోను కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచిన నాగ్‌.. 'తోపు, డూపు' గేమ్‌ ఆడించాడు. లోబో ముందుగా ఆరుగురు డూపుల గురించి చెప్తూ.. కాజల్‌ లాంటి జనాలు నాకు నచ్చరు, ఆమె ఊసరవెళ్లి అన్నాడు. ప్రియ.. వేరేవాళ్లతో అంతా చేపిస్తూ సైలెంట్‌గా కూర్చుంటది, వెనకాల ఒకమాట, ముందొకమాట మాట్లాడుతుందని చీదరించుకున్నాడు. రవికి అవసరమున్నప్పుడే ఈ లోబో గుర్తొస్తాడని బాధపడ్డాడు. యానీ.. స్మార్ట్‌ అని, షణ్ముఖ్‌ యాటిట్యూడ్‌ నచ్చదని, అతడు యాక్టింగ్‌ చేస్తున్నాడని తెలిపాడు. వీళ్లు కాకుండా మిగిలిన ఆరుగురు తోపులని చెప్పాడు. అనంతరం నాగార్జున కాజల్‌ సేఫ్‌ అని వెల్లడించాడు. ఇక ఈ వారం ప్రియ వెళ్లిపోతుందని నాగ్‌ కన్నా ముందే లీకువీరులు నెట్టింట ప్రచారం మొదలెట్టిన విషయం తెలిసిందే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top