
బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (Priyanka Jain) ఇటీవల 27వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంది. ఆ సమయంలో కేక్‌ను కాలి చెప్పుపై పెట్టి ఫోటోలకు పోజిస్తూ విమర్శలపాలైన సంగతి తెలిసిందే! అయితే తన బర్త్‌డే రోజు మరో పని కూడా చేసింది. తనకు జన్మనిచ్చిన తల్లి కోసం ఓ ఫోటోషూట్ ప్లాన్ చేసింది. మా అమ్మ ప్రెగ్నెన్సీ అంటూ సదరు షూట్ ఎలా జరిగిందో తెలియజేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.

నా బేబీ కోసం ఆలోచిస్తున్నా..
ప్రియాంక ప్రియుడు, నటుడు శివకుమార్ ఈ వీడియో రికార్డ్ చేశాడు. మీ అమ్మ ప్రెగ్నెన్సీ షూట్ జరుగుతోంది. మరి నీకు తమ్ముడు కావాలా? చెల్లి కావాలా? అని అడిగాడు. అందుకు ప్రియాంక.. నువ్వు తమ్ముడు, చెల్లి అని అడుగుతున్నావు. నేనింకా నాకెప్పుడు బేబీ పుడుతుందా? అని ఆలోచిస్తున్నా అని పంచ్ వేసింది. ఆ మాటతో షాకైన శివకుమార్.. పెళ్లి చేసుకున్నాక ఇలాంటివి మాట్లాడమని ఆన్సరిచ్చాడు.
27 ఏళ్ల కిందట ప్రెగ్నెంట్
దానికి ప్రియాంక బదులిస్తూ.. పెళ్లి చేసుకున్నాకే కదా పిల్లల్ని కనేది.. ఆ పెళ్లే ఎప్పుడు అవుతుందా? అని ఆలోచిస్తున్నాను. ఒకమ్మాయిగా నా బాధ నీకేం తెలుసులే అని కామెంట్ చేసింది. తర్వాత తన తల్లి ప్రెగ్నెన్సీ షూట్ గురించి మాట్లాడుతూ.. మా అమ్మ 27 ఏళ్ల కింద ప్రెగ్నెంట్ అయింది. అప్పుడు తన కడుపులో నేనున్నాను. ఆ ప్రెగ్నెన్సీని ఇప్పుడు రీక్రియేట్ చేస్తున్నాం. నేను పుట్టేముందు మా అమ్మ ఎలా ఫీలైంది? అని కళ్లారా చూడాలనుకున్నాను. అలాగే తనకు సీమంతం కూడా జరగలేదు. అందుకే ఇలా ఫోటోషూట్ ప్లాన్ చేశాను అంది. కూతురు తనకు ప్రెగ్నెన్సీ షూట్ చేసేసరికి ప్రియాంక తల్లి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది.
చదవండి: ఎంతోసేపు పురిటినొప్పులు భరించాక పుట్టావురా.. నటి భావోద్వేగం