పెళ్లి అనేది మూణ్నాళ్ల ముచ్చటగానే మారుతోంది. భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా కనిపించే జంటలు కూడా చివరకు విడాకుల బాటలో పయనిస్తుండటం కొంత షాకింగ్‌గానే ఉంది. తాజాగా బుల్లితెర జంట జే భానుషాలి (Jay Bhanushali)- మహి విజ్ (Mahhi Vij) విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. 14 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలకాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మీకెందుకు చెప్పాలి?
ఈ మేరకు కొద్ది నెలల క్రితమే విడాకులకు దరఖాస్తు చేశారట! ముగ్గురు పిల్లల్ని పంచుకోనున్నారట! గతంలోనూ ఈ దంపతులు విడిపోతున్నట్లు ప్రచారం జరిగింది. అప్పుడు మహి స్పందిస్తూ.. ఒకవేళ నిజంగా విడిపోయినా మీకెందుకు చెప్పాలి? మీరేమైనా నా చుట్టాలా? లాయర్ ఫీజు కడతారా? ఛాన్స్ దొరికిందని ఎవరినో ఒకర్ని నిందించడం తప్ప ఏమీ చేయరు అని సీరియస్ అయింది.

బుల్లితెర జంట
మహి.. 2004లో వచ్చిన తెలుగు మూవీ తపనలో హీరోయిన్‌గా నటించింది. మలయాళం, కన్నడ భాషల్లో ఒక్కో సినిమా చేసింది. వెండితెరను నమ్ముకోకుండా బుల్లితెరపైనే సెటిల్ అయిపోయింది. హిందీలో అనేక సీరియల్స్ చేసింది. జే భానుషాలి హేట్ స్టోరీ 2ల, దేసి కట్టే, ఏక్ పహేలీ లీలా సినిమాలు చేశాడు. బుల్లితెరపై పలు సీరియల్స్ చేశాడు. జే భానుషాలి, మహి 2011లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ జంటగా నాచ్ బలియే సీజన్ 5లో పాల్గొని ట్రోఫీ గెలిచారు.
ఐవీఎఫ్ ప్రయత్నాలు
జే.. హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్‌లోనూ పాల్గొన్నాడు. సింగింగ్, డ్యాన్సింగ్ షోలకు యాంకరింగ్ చేస్తుంటాడు. జే- మహిలకు పెళ్లయిన తర్వాత చాలా ఏళ్లవరకు సంతానం కలగలేదు. దీంతో బాబు రాజ్‌వీర్, పాప ఖుషిలను 2017లో దత్తత తీసుకున్నారు. అప్పటికీ సంతానం కోసం ప్రయత్నించే క్రమంలో మూడుసార్లు ఐవీఎఫ్ ఫెయిలవగా నాలుగోసారికి సక్సెస్ అయింది. 2019లో ఐవీఎఫ్ ద్వారా కూతురు తార జన్మించింది.
చదవండి: మీసాల పిల్ల.. 13 రోజులుగా ట్రెండింగ్.. ఏకంగా ఎన్ని వ్యూస్ అంటే?


