Bigg Boss 6 Telugu: Nagarjuna Gives Punishment To Singer Revanth, Deets Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: ఆమెను చూస్తే జెలసీ, గీతూ అవసరానికి వాడుకునే రకం!

Oct 23 2022 6:54 PM | Updated on Oct 23 2022 7:33 PM

Bigg Boss 6 Telugu: Nagarjuna Gives Punishment To Singer Revanth - Sakshi

వాసంతి షో పీస్‌ అని, ఆమె అందం చూస్తే జెలసీ వచ్చేస్తోందంది ఇనయ. ఇనయ ఇగో వల్ల తాను హర్ట్‌ అయ్యానంది వాసంతి.

బిగ్‌బాస్‌ షో దీపావళి ఎపిసోడ్‌ ప్రారంభమైంది. ముందుగా బిగ్‌బాస్‌ సీజన్‌ 6 మీద బాలాదిత్య రాసిన పాటను శ్రీహాన్‌, రేవంత్‌తో కలిసి పాడాడు. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లతో సహా హౌస్‌లో ఉన్న అందరినీ ప్రస్తావిస్తూ ఆ పాట సాగింది. ఇది విన్నాక నాగ్‌ సాంగ్‌ అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. అనంతరం హౌస్‌మేట్స్‌తో నాగ్‌ ఓ గేమ్‌ ఆడించాడు.  కొన్ని బోర్డులను ఎవరికి సెట్‌ అవుతాయో వారి మెడలో వేయాలన్నాడు. దీంతో ముందుగా గీతూ లేచి.. చేతికర్ర బోర్డు అర్జున్‌ మెడలో వేస్తూ అతడు ఒకరి మీద ఆధారపడతాడు, సొంతంగా నిర్ణయం తీసుకోడని చెప్పుకొచ్చింది. గీతూ అందరినీ రెచ్చగొడుతుందన్నాడు శ్రీహాన్‌. కోపాన్ని తగ్గించుకోమని రేవంత్‌కు సలహా ఇచ్చారు ఫైమా, కీర్తి. నామినేషన్‌లో ఇనయ ప్రతిదాన్నీ సాగదీస్తుందని చెప్పింది మెరీనా. గీతూకు బద్ధకమెక్కువ అన్నాడు రాజ్‌.

వాసంతి షో పీస్‌ అని, ఆమె అందం చూస్తే జెలసీ వచ్చేస్తోందంది ఇనయ. ఇనయ ఇగో వల్ల తాను హర్ట్‌ అయ్యానంది వాసంతి. రేవంత్‌ గోరంతది కొండంత చేసి చెప్తాడంది శ్రీసత్య. గీతూ బుద్ధి శుద్ధి చేసుకోవాలన్నాడు బాలాదిత్య. ఇనయ ప్రతిదానికి పొడుస్తుందన్నాడు సూర్య. ఎదుటివాళ్లు చెప్పేది వినేవరకు రేవంత్‌ నోరు మూసుకోవాలన్నాడు ఆదిరెడ్డి. రేవంత్‌ తనకున్న నెగెటివ్స్‌ డస్ట్‌బిన్‌లో వేయాలన్నాడు అర్జున్‌. రాజ్‌ ట్యూబ్‌లైట్‌ అన్నారు రోహిత్‌. గీతూ అవసరానికి వాడుకుంటుందన్నాడు రేవంత్‌.

ఇకపోతే మొన్నామధ్య బిగ్‌బాస్‌.. ఇంటిసభ్యులకు ఫుడ్‌ కట్‌ చేసిన విషయం తెలిసిందే కదా! గేమ్స్‌ పెట్టి అందులో గెలిచిన టీమ్‌కు మాత్రమే ఫుడ్‌ పంపించాడు. అయితే గెలిచిన టీమ్‌ మెంబర్‌ అయిన ఆదిరెడ్డి ఓడిన టీమ్‌ మెంబర్‌ గీతూకు ఫుడ్‌ షేర్‌ చేయడంతో వీరిద్దరికీ అంట్లు తోమమని పనిష్మెంట్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. కానీ రేవంత్‌ కూడా గీతూకు ఫుడ్‌ షేర్‌ చేశాడంటూ ఆ విషయాన్ని బయటపెట్టాడు నాగ్‌. అందుకు శిక్షగా ఈరోజు ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ రేవంత్‌ తోమాలని చెప్పాడు. తర్వాత రేవంత్‌, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, రాజ్‌, ఫైమా సేఫ్‌ అయినట్లు ప్రకటించాడు.

చదవండి: ఉదయ్‌కిరణ్‌తో ఐదు సినిమాలకు సంతకం చేశా: సుదీప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement