Bigg Boss 5 Telugu Winner: బిగ్‌బాస్ విజేత వీజే సన్నీ

VJ Sunny In Bigg Boss 5 Telugu: 'కళ్యాణ వైభోగమే' సీరియల్‌తో బాగా పాపులర్ అయ్యాడు సన్నీ. ఈ సీరియల్ నుంచి ఆయనకు అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇతడిని ఫ్యాన్స్ అంతా బుల్లితెర జూనియర్ ఎన్టీఆర్ అని ప్రేమగా పిలుచుకుంటారు. గతంలో యాంకరింగ్ చేసిన అతడు కళ్యాణ వైభోగమే సీరియల్‌తో వచ్చిన పాపులారిటీతో ఏకంగా సినిమా ఛాన్స్ అందుకున్నాడు.
'సకలగుణాభిరామ' సినిమాలో నటించిన ఈ మోడల్ బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో రెండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగమ్మాయిలు అందంగా, ముద్దుగా ఉంటారన్న సన్నీ అచ్చ తెలుగమ్మాయే తనకు భార్యగా రావాలని ఆశపడ్డాడు. వస్తూ వస్తూనే తన డ్రీమ్ గర్ల్ గురించి వెతికాడు. కానీ అతడికి ఆ స్వప్న సుందరి జాడ దొరకలేదు. ఇక హౌస్‌లో అందరినీ ఎంటర్‌టైన్ చేస్తూ, టాస్కులు రఫ్ఫాడిస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. ప్రేక్షకుల మనసులు గెలుచుకుని ఈ సీజన్‌కు విజేతగా నిలిచాడు.