అవినాష్‌, నువ్వుంటావ్‌: అమ్మ రాజ‌శేఖ‌ర్‌

Bigg Boss 4 Telugu: Is There Double Elimination - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లోకి బుల్లితెర క్వీన్‌, యాంక‌ర్ సుమ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ అని జ‌నాల‌ను ఊద‌ర‌గొట్టారు. కానీ ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు కూడా జ‌నాల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. తాజాగా రిలీజైన ప్రోమోలో భూతద్దం వేసి వెతికినా ఏ మూల‌నా సుమ క‌నిపించనేలేదు. దీంతో సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అబ‌ద్ధ‌మేన‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇక ఇప్పుడు బిగ్‌బాస్.. డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉండ‌బోతుందా? అని ప్రేక్ష‌కుల మెద‌ళ్ల‌లో అనుమానాన్ని నాటే సాహ‌సం చేశారు. కానీ ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌న్‌కు ఆస్కారం లేద‌ని, ఇప్పుడు అంత అవ‌స‌రం కూడా లేద‌ని వీక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే లేటెస్ట్ ప్రోమోలో అమ్మ రాజ‌శేఖ‌ర్‌, అవినాష్ ఇద్ద‌రినీ రెండు గ‌దుల్లోకి పంపించారు. కాసేప‌టి త‌ర్వాత రెండు గ‌దుల‌ను తెరిచి చూస్తే అందులో ఒక్క‌రే ఉంటార‌ని నాగ్ వెల్ల‌డించారు. (చ‌ద‌వండి: మోనాల్ నీకు ఫ్రెండా? అంత‌కు మించా?: నాగ్‌‌)

ఈ సంద‌ర్భంగా అమ్మ రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. అవినాష్‌, నువ్వు ఉంటావంటూ భ‌రోసా ఇచ్చాడు. కానీ అనూహ్యంగా రెండు గ‌దుల్లోనూ ఇద్ద‌రూ మాయ‌మ‌వ‌గా.. డ‌బుల్ ఎలిమినేష‌న్‌కు అవ‌కాశం ఉంద‌ని బాంబు పేల్చాడు. దీంతో అంద‌రిక‌న్నా ఎక్కువ‌గా అరియానా షాకైంది. క‌న్నీళ్ల‌ను ఆపుకుంటూ మీరు నిజ‌మే చెప్తున్నారా అని నాగ్‌ను ప్ర‌శ్నించింది. అయితే దీనికి ఆయ‌న మాత్రం ఎలాంటి స‌మాధాన‌మివ్వలేదు. ఇక అయితే సోష‌ల్ మీడియా మాత్రం షో నుంచి మాస్ట‌ర్ మాత్ర‌మే వెళ్లిపోయాడ‌హో.. అని కోడై కూస్తోంది. ఇక నెటిజ‌న్లు కూడా ఎప్పుడూ ఈ డ‌బుల్ ఎలిమినేష‌న్ డ్రామాలు ఏమిటో? అని విసుగు చెందుతున్నారు. ఒక‌వేళ ఇది నిజ‌మే అయితే అవినాష్‌ను సీక్రెట్ రూమ్‌లోకి పంపుతారేమో అని కామెంట్లు పెడుతున్నారు. మ‌రి నేడు డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉంటుందా? ఏదైనా ట్విస్టు ఉంటుందా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు వేచి చూడాల్సిందే! (చ‌ద‌వండి: మా ఆయ‌న లేక‌పోతే బిగ్‌బాస్ షో లేదు)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top