ఇంత కథ ఉన్న సినిమా నేను ఎప్పుడు చూడలేదు : హీరో బెల్లంకొండ | Bellamkonda Sai Srinivas Talks About kishkindhapuri Movie | Sakshi
Sakshi News home page

హారర్ మిస్టరీ ఉన్న ఒక కొత్త జానర్ ఇది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

Sep 10 2025 6:35 PM | Updated on Sep 10 2025 7:12 PM

Bellamkonda Sai Srinivas Talks About kishkindhapuri Movie

నేను ఆడియన్స్ కి నచ్చే సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. ఆ క్రమంలో చాలా వరకూ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ వచ్చాయి. అయితే నాకు పర్సనల్ గా హారర్ సినిమాలంటే ఇష్టం. మా ప్రొడక్షన్ లో చేసిన కాంచన లాంటి సినిమాలు చాలా ఎంజాయ్ చేశాను.చాలా రోజుల తర్వాత నాకు నచ్చే జానర్‌లో  కిష్కింధపురి అనే ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేసే అవకాశం దొరికింది. ఖచ్చితంగా  ఈ చిత్రం డియన్స్ కి ఒక డిఫరెంట్ థ్రిల్, సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది’అన్నారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. 

ఆయన హీరోగా నటించిన తాజా హారర్‌ థ్రిల్లర్‌ ‘కిష్కింధపురి’.  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. సెప్టెంబర్‌ 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సాయి శ్రీనివాస్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...

దర్శకుడు కౌశిక్ కు మంచి కథ రెడీ చేసుకున్నాడు. అయితే ఇలాంటి జోనర్స్ సినిమాలకి బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి. కానీ సాహు  ఆడియన్స్ కి ద బెస్ట్ ఇవ్వాలని టెక్నికల్ గా గ్రాఫిక్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు. సినిమాకి కావాల్సిన ప్రతిదీ ఇచ్చారు.ఈ సినిమా చేయడం చాలా ప్రౌడ్ గా ఉంది. సినిమాని ఇలా కూడా తీయొచ్చా అనిపించేలా చేసిన సినిమా ఇది.

నిన్న ఫస్ట్ టైం థియేటర్స్ లో ఈ సినిమా చూసాం. అదిరిపోయింది. ముఖ్యంగా  సౌండ్. సలార్ యానిమల్ కాంతారా సినిమాలకు పనిచేసిన సౌండ్ డిజైనర్ రాధాకృష్ణ  సౌండ్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈ సినిమాకి అద్భుతమైన సౌండ్ డిజైన్ చేసే స్పేస్ ఉంది. హారర్ మిస్టరీ ఉన్న ఒక కొత్త జానర్ ఇది. టెక్నికల్ అద్భుతంగా ప్రజెంట్ చేశాం.

ఈ సినిమా కథలోనే యాక్షన్ ఉంది. మొత్తం ఆర్గానిక్ గా చేసిన సినిమా ఇది. విజువల్ ఎఫెక్ట్స్ సౌండ్ పరంగా ఆడియన్స్ చాలా థ్రిల్ అవుతారు. హారర్ సినిమాలో ఇంత కథ ఉన్న సినిమా నేను ఎప్పుడు చూడలేదు. హారర్ మిస్టరీ రెండు బ్లెండ్ అయిన సినిమా ఇది. ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ ఎక్స్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

ఈ సినిమా కోసం సువర్ణమాయ రేడియో స్టేషన్ ని సెట్ గా వేశాం. అలాగే రియల్ వాంటెడ్ హౌస్ లో షూట్ చేశాం. అది రియల్ గా పాతబడిపోయిన బిల్డింగ్‌. తర్వాత వాళ్లకి కొత్త బిల్డింగ్ వేసి ఇవ్వడం జరిగింది.

ఈ సినిమాని టీనేజ్ ఆడియన్స్  కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. హారర్ కారణంగా సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఇంత సీరియస్ హారర్ సినిమా చూసి చాలా కాలం అయిందని సెన్సార్ సభ్యులు చెప్పడం ఆనందాన్నిచ్చింది.

ఈ మధ్య ఏదైనా ఒక కొత్తగా చేయాలి, యాక్టర్ గా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అనే కసి పెరిగింది. ఒక కొత్త క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు సెట్లో లొకేషన్ లో ఆ ఎనర్జీ వేరుగా ఉంటుంది. ఈ మధ్య ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను.

కొత్త సినిమాల విషయానికొస్తే.. టైసన్ నాయుడు షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. హైందవ షూటింగ్ చివరి దశకు వచ్చింది. సమ్మె కారణంగా బ్రేక్ పడింది కానీ ఈపాటికి షూటింగ్ అయిపోయేది. ఈ రెండు కూడా డిఫరెంట్ సినిమాలు. అలాగే పొలిమేర డైరెక్టర్ అనిల్ తో ఒక సినిమా ఉండబోతుంది. అది న్యూ ఏజ్ థ్రిల్లర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement