హృదయాలను హత్తుకునేలా ‘బ్యూటీ’ ట్రైలర్‌ | Beauty Trailer Released By Naga Chaitanya Akkineni | Sakshi
Sakshi News home page

హృదయాలను హత్తుకునేలా ‘బ్యూటీ’ ట్రైలర్‌

Sep 13 2025 7:21 PM | Updated on Sep 13 2025 7:57 PM

Beauty Trailer Released By Naga Chaitanya Akkineni

అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యూటీ’. ఫాదర్ డాటర్ రిలేషన్, ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రానికి  ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. సెప్టెంబర్‌ 19న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్‌.  యువ సామ్రాట్ నాగ చైతన్య విడుదల చేసిన ఈ ట్రైలర్‌.. హృదయాలను హత్తుకునేలా ఉంది.

ఎప్పుడైనా నేను నిన్ను కొప్పడితే నన్ను అలా వదిలి పెట్టి వెళ్ళకు'.., 'నిన్ను వదిలేసి వెళ్ళడం అంటే.. నా ఊపిరి వదిలేయడమే కన్నా' అంటూ హీరో హీరోయిన్లు చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఓపెన్ చేశారు. స్కూటీ కొనిస్తాను అని తండ్రి మాట ఇవ్వడం, మిడిల్ క్లాస్ ఫాదర్ ఎమోషన్స్, 'క్యాబ్ డ్రైవర్ అయితే క్యాబ్ డ్రైవర్ లా ఉండాలి గానీ కలెక్టర్ లా ప్రామిస్ చేయొద్దు' అనే డైలాగ్ ప్రతీ ఒక్కరిని కదిలించేలా ఉంది.

ఈ ట్రైలర్ లోని డైలాగ్స్, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, ఫాదర్ డాటర్ ఎమోషన్, మిడిల్ క్లాస్ కష్టాలు ఇలా అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. ఇక మ్యూజిక్, ఆర్ ఆర్, విజువల్స్ అయితే టాప్ నాచ్ గా ఉన్నాయి. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారు నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement