
బండ్ల గణేశ్.. కమెడిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత నిర్మాతగా మారి బడా చిత్రాలను నిర్మించాడు.ఎన్టీఆర్, రవితేజ, పవన్ లాంటి స్టార్ హీరోలతో వరుస సినిమాలు నిర్మించి..టాలీవుడ్‌లో కొన్నాళ్ల పాటు అగ్ర నిర్మాతగాను కొనసాగాడు. అయితే గత కొంతకాలంగా ఆయన నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి చిత్రాలు రావడం లేదు. నటుడిగానూ తెరపై కనిపించడం లేదు. అయినప్పటికీ బండ్ల గణేశ్ పేరు ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా వినిపిస్తూనే ఉంటుంది. అందుకు కారణం ఆయన చేసే ప్రసంగాలు.. సోషల్ మీడియా పోస్టులు అనే చెప్పాలి. ప్రీరిలీజ్ ఈవెంట్స్‌తో ఆయన ఇచ్చే స్పీచ్‌లు వైరల్ అవుతుంటాయి. హీరోలను పొగడ్తలతో ముంచేస్తుంటాడు.
ఇక పవన్ కల్యాణ్‌కు ఆయన చేసే భజన అంత ఇంతా కాదు. అవకాశం వచ్చినప్పుడల్లా పవన్‌ని ఆకాశానికి ఎత్తేస్తుంటాడు. అలాంటి వ్యక్తిని పవన్ కల్యాణ్ కొంతకాలంగా దూరం పెట్టినట్లు తెలుస్తుంది. పవన్ సినిమా ఈవెంట్స్‌కి బండ్ల గణేశ్ కి ఆహ్వానం అందడం లేదు. ఇటీవల జరిగిన ఓజీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి సైతం బండ్ల గణేష్‌కు పిలుపు రాలేదు. దీంతో పవన్‌పై బండ్లన్న అలిగినట్లు ఉన్నాడు. తన అసహనాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
‘కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు. నీవు చేయని వాటినే మాత్రమే చూస్తారు. కృతజ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు’ అని బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు.
ఈ పోస్ట్ పవన్ కల్యాణ్ గురించే చేశాడని నెటిజన్స్ అభిప్రాయపెడుతున్నారు. ‘నిజమే.. పవన్‌కి కృతజ్ఞత ఉండదు’, ‘ఈ విషయం ఇదివరకే అర్థమై చెప్పిన వారిపై గయ్యిన లేచే వాడివిగా! గుడ్డి మైకం లో ఉన్నప్పుడు, నీకు కూడా అర్దం కాలేదుగా! అయినా ఎప్పటికీ అర్దం కాని కొంతమంది పిచ్చి మలోకాలు ఎప్పటికీ ఉంటాయి! అందుకే ఎందుకు పనికి రాని వారు అందలం ఎక్కి ఊరేగుతారు! వారు వీరందరినీ పల్లకి మోసే బోయలు మాత్రమే!’ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు.
నీవు చేయని వాటినే మాత్రమే చూస్తారు.
కృతఙ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు.— BANDLA GANESH. (@ganeshbandla) September 24, 2025