శివకార్తికేయన్‌ చిత్రానికి అవతార్‌ టీం?

Avatar 2 Team work For Sivakarthikeyan Ayalaan Movie - Sakshi

హాలీవుడ్‌ దర్శక దిగ్గజం జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి అవతార్‌ ది వే ఆఫ్‌ వాటర్‌. ఈ చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రేక్షకులను మైమరిపిస్తున్నాయి. ఆ చిత్రానికి బలం నేపథ్య సంగీతం, విజువల్‌ ఎఫెక్ట్సే. అలాంటి చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు కొందరు ఇప్పుడు తమిళ చిత్రం అయలాన్‌కు పనిచేస్తున్నట్లు సమాచారం. నటుడు శివ కార్తికేయన్‌ ఇంతకుముందు నటించిన డాక్టర్, డాన్‌ చిత్రాల విజయాలకు తాజాగా నటించిన ప్రిన్స్‌ చిత్రం బ్రేక్‌ వేసింది.

దీంతో తదుపరి నటిస్తున్న అయలాన్‌ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ఆయనకు జంటగా రకుల్‌ ప్రీతిసింగ్‌ నటిస్తుండగా, ఇషా గోపికర్, భానుప్రియ, యోగి బాబు, బాల శరవణన్, కరుణాకర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అవతార్‌ ది వే ఆఫ్‌ వాటర్‌ చిత్రానికి పనిచేసిన హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులు కొందరు పనిచేస్తున్నట్లు తెలిసింది. దీంతో అయలాన్‌ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఈ చిత్రాన్ని 2023లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top