ప్రెసిడెంట్ అయిన 24 గంటల్లోనే పదవికి రాజీనామా | Asian Suniel Resigns As Telangana State Film Chamber Chairman With 24 Hours Of Being Elected, Know Reason Inside | Sakshi
Sakshi News home page

Suniel Narang: తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ సునీల్ రాజీనామా

Jun 8 2025 6:59 PM | Updated on Jun 9 2025 10:10 AM

Asian Suniel Resigns Telangana State Film Chamber

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లోనే ఆ పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. అందుకు గల కారణాల్ని కూడా వెల్లడించారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఎవరికి వారు ప్రకటనలు జారీ చేస్తున్నారని, కొందరి వ్యాఖ్యలు తనని బాధించాయని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ పదవిలో కొనసాగడం తనకు కష్టంగా ఉందని చెబుతూ ఓ లేఖని రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు)

అసలేం జరిగిందంటే?
టాలీవుడ్‌లో గత కొన్నిరోజులుగా అనిశ్చితి వాతావరణం నెలకొంది. పర్సంటేజీ విషయమై నిర్మాతలతో సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లకు మధ్య కొన్నిరోజుల క్రితం చర్చలు నడిచాయి. ఇది జరిగిన కొన్నిరోజులకు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు బంద్‍‌ చేయనున్నారనే న్యూస్ బయటకొచ్చింది. దీని తర్వాత పవన్ కల్యాణ్.. ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేశారు. తన సినిమా 'హరిహర వీరమల్లు' వస్తుందనే ఇలా చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన తర్వాత ఆ నలుగురు అనే మాట తెగ వైరల్ అయింది.

ఆ నలుగురే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లని శాసిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. దీంతో తొలుత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. పవన్ సినిమాని ఆపడానికి తాము ప్రయత్నించలేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో శనివారం.. తెలంగాణ ఫిలిం చాంబర్‌లో జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్‌ని ఎంపిక చేశారు. ఇప్పుడు ఇది జరిగిన 24 గంటలు కూడా కాకముందే ఆ పదవికి సునీల్ రాజీనామా చేశారు.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement