అనుష్క నంబర్ అనుకుని వందల సార్లు..: డైరెక్టర్ | Sakshi
Sakshi News home page

Vivek Athreya:అనుష్క ఫోన్ నంబర్ అనుకుని వీడియో కాల్.. అవీ లేకుండానే: వివేక్ ఆత్రేయ

Published Fri, Feb 24 2023 11:40 PM

ante sundaraniki movie director vivek athreya comments On Anushka - Sakshi

'అంటే సుందరానికీ' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు యంగ్ డైరెక్టర్ వివేక్‌ ఆత్రేయ. చాలా విభిన్న కథలతో సినీ అభిమానులను అలరించారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి చిత్రాలు తెరకెక్కించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో నెగెటివిటీ విస్తరించిందన్నారు. కొంతమంది నెటిజన్లు కావాలనే తనపై విమర్శలు చేస్తున్నారని ఆత్రేయ చెప్పారు. సెలబ్రిటీలు సోషల్‌మీడియాకు దూరంగా ఉంటేనే ఇలాంటివి తగ్గుతాయని తెలిపారు. కొవిడ్‌ సమయంలో ఎదురైన సంఘటను దర్శకుడు వెల్లడించారు.

డైరెక్టర్ వివేక్‌ ఆత్రేయ మాట్లాడుతూ.. 'కొవిడ్‌ సమయంలో నా స్నేహితుడి ఫాదర్ అనారోగ్యం బారిన పడ్డారు. ఆయనకు రక్తం అవసరం కావడంతో బ్లడ్‌ రక్తదాత కోసం చాల వెతికాం. నా ఫోన్‌ నంబర్‌ని జత చేస్తూ అందరికీ మేసేజెస్ పంపా. ఈ విషయం తెలుసుకున్న నటి అనుష్క మాకు సాయం చేయడం కోసం ఆ సందేశాన్ని తన సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. అయితే ఆ ఫోన్‌ నంబర్‌ అనుష్కదే అనుకుని అందరూ పొరబడ్డారు. చాలామంది కాల్స్‌ కూడా చేశారు. ఆ పోస్ట్‌ పెట్టిన తర్వాత నా ఫోన్‌కు వచ్చిన కాల్స్‌ ఎవరూ ఊహించి ఉండరు. ఒకరు వీడియో కాల్‌ చేస్తే.. మరొకరు షర్ట్‌ లేకుండా ఫొటోలు పంపారు. ఇక ఆ దారుణాలను నేను చెప్పలేను. హీరోయిన్ల జీవితం ఇంత కష్టంగా ఉంటుందా అని షాక్‌కు గురయ్యా. ఆ తర్వాత ఆ ఫోన్‌ నంబర్‌ బ్లాక్‌ చేశా.' అని అన్నారు.

అంటే సుందరానికీ చిత్రానికి వచ్చిన స్పందనపై ఆయన మాట్లాడారు. ఆ చిత్రానికి వచ్చిన ఫలితంపై పూర్తి బాధ్యత నాదేనని చెప్పారు. ఆ సినిమా  కొంతమంది నచ్చగా.. మరికొందరు నిడివి ఎక్కువ ఉందని కామెంట్స్‌ చేశారు. సినిమా నిడివి పది నిమిషాలు ఎక్కువైందని తెలుసు.. కానీ ఎడిట్‌ చేయడానికి వీల్లేకుండా పోయింది. ఎందుకంటే ఒక సీన్‌కు మరో సీన్‌కు లింక్‌ ఉంది. అయితే సినిమాకు ఎక్కువగా దగ్గర కాకూడదని ఈ చిత్రం ద్వారా నేర్చుకున్నా. ఎందుకంటే అంటే సుందరానికీ ఫలితం నన్ను తీవ్రంగా బాధించింది.' అని అన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement