ఆ డబ్బులు తీసుకోమన్నా కూడా..: యాంకర్‌ ఝాన్సీ

Anchor Jhansi Touch Up Assistant Helping To Poor People - Sakshi

కరోనా వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ అమలవతుండటంతో చాలామంది తమ ఉపాధిని కోల్పోయి పూట గడవని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి వారి కోసం సెలబ్రిటీలు ముందుకు వస్తూ ఉన్నంతలో వారికి సాయం చేస్తున్నారు. అందులో యాంకర్‌ ఝాన్సీ కూడా ఒకరు.

బుల్లితెర యాంకర్‌ ఝాన్సీ లాక్‌డౌన్‌ వల్ల ప్రభావితమైన పేదలకు నిత్యావసర సరుకులను అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటోంది. ఈ సేవా కార్యక్రమాలను ఆమె టీమ్‌ దగ్గరుండి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తన మేకప్‌ మ్యాన్‌ అసిస్టెంట్‌ రమణ చేస్తున్న మంచి పనుల గురించి అభిమాలతో చెప్పుకుంటూ ఉద్వేగానికి లోనైంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది.

"నా దగ్గర పని చేస్తున్న సిబ్బందిని చూసి గర్వపడుతున్నా. నా టచప్‌ అసిస్టెంట్‌ రమణ లాక్‌డౌన్‌లో నిరుపేదలకు అవసరమైన నిత్యావసర సరుకులు అందిస్తున్నాడు. నాకు వీలైనంతలో ఒక 25 మందికి నెలకు సరిపడా సరుకులు ఇచ్చే పనిని రమణ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అందులో చిన్న మొత్తం మిగిలింది. అయితే దాన్ని నీ దగ్గరే ఉంచు రమణా అని చెప్పినప్పటికీ, ప్రస్తుతం తనకు ఇబ్బంది లేదంటూ అవసరం ఉన్న మరో నలుగురికి నిత్యావసరాలు అందించాడు. మంచితనం డబ్బుతో రాదు.. రమణ, శ్రీను పుట్టుకతోనే గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తులు, వీరితో పని చేయడం నా అదృష్టం" అని రాసుకొచ్చింది.

చదవండి: హీరోగా జూ.ఎన్టీఆర్‌ అందుకున్న ఫస్ట్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top