Anasuya Bharadwaj: ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టిపై అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు

కన్నడ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు రిషబ్ శెట్టి. ఇక కాంతార మూవీ సృష్టించిన ప్రభంజనం అంతఇంత కాదు. ఎలాంటి అంచనాలు లేకండా ప్రాంతీయ సినిమాగా వచ్చిన పాన్ ఇండియా స్థాయిలో కలేక్షన్స్ రాబట్టింది. కేవలం రూ. 15 కోట్లతో నిర్మించిన కాంతార ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇందులో రిషబ్ శెట్టి నటనకు ఫిదా కాని ప్రేక్షకుడు ఉండటంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు.
ఇదిలా ఉంటే రిషబ్ శెట్టిపై టాలీవుడ్ నటి, ప్రముఖ యాంకర్ అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా అనసూయ తన ఇన్ స్టాలో ఫాలోవర్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె ఫ్యాన్స్ ఒకరు ఓ మంచి సినిమాను రెకమండ్ చేయమని అడగ్గా.. కాంతార అని సమాధానం ఇచ్చింది. ఇక ఈ సనిమాపై, హీరో రిషబ్ శెట్టిపై ప్రశంసలు వర్షం కురిపించింది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నమ్మశక్యం కానీ రీతిలో నటించారు. నేను ఇంకా ఆ సినిమా ప్రభావం నుంచి బయటకు రాలేకపోతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం అనసూయ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న రంగమార్తండ చిత్రంలో నటిస్తోంది.
చదవండి:
తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన కీర్తి సురేశ్
హీరోయిన్ అయితే అలాంటి పాత్రలు చేయొద్దా?: ట్రోలర్స్‌కు మృణాల్ ఘాటు రిప్లై
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు