టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీవాన మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ రోజుల్లో లవ్ గురించి మాట్లాడారు. నేటి తరం లవ్ అంటే జనాల్లేని థియేటర్లకు వెళ్లి.. కార్నర్ సీట్‌లో కూర్చొని సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. ఆ తర్వాత రెండుసార్లు షాపింగ్ చేశాక.. నేరుగా ఓయో రూమ్‌లోనే ఎండ్ అవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటి యువత ప్రేమ గురించి అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి.
ఇది విన్న హీరో విశ్వక్ సేన్.. అంటే ఏంటి సార్ నాకు తెల్వదు అంటూ ఫన్నీగా మాట్లాడారు. మీకు ఎవరితో ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాను చూశారని యాంకర్ ప్రశ్నించగా.. ఇప్పుడు ఆ పేరు చెబితే బాగోదు.. వాళ్లకు మనవలు, మనవరాలు కూడా ఉన్నారంటూ సరదాగా మాట్లాడారు.
కాగా.. హర్షిత్, స్మేహ ప్రధానపాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం దీవాన. ఈ సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఏఏఏ సినిమాస్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో అల్లు అరవింద్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
#VishwanSen: ఈరోజు మీ Oneside Love Story చెప్పాలి...#AlluArvind: ఒక్కటా... రెండా... 😂
ఈ మధ్య LOVE:
జనం లేని సినిమాలకి వెళ్ళి...
2 Shopping లు చేసుకొని..
OYO లో End అవుతుంది.. pic.twitter.com/Kv4KvS17sQ— Movies4u Official (@Movies4u_Officl) June 11, 2026


