మీ అందరికి రుణపడి ఉంటా.. అల్లు అర్జున్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

All Arjun Emotional Tweet About His 18 Years Film Career  - Sakshi

సరిగ్గా 18 ఏళ్ల క్రితం.. యావరేజ్‌ లుక్స్‌తో, మూతిపై మీసం కూడా సరిగ్గా మొలవని ఓ యువకుడు టాలీవుడ్‌లోకి కథానాయకుడిగా ఆరంగ్రేటం చేశాడు. మెగా ఫ్యామిలీ హీరోగా కెరీర్‌ మొదలుపెట్టినప్పటకీ ఆ మార్క్‌తో సంబంధం లేకుండా స్వయం కృషితో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లో ఫ్యాషన్, స్టైల్ కు కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. అతడే మన ‘స్టైలిష్‌‌ స్టార్’ అల్లు అర్జున్‌. బన్నీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నేటికి 18 సంవత్సరాలు పూర్తయ్యాయి.ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ ట్వీటర్‌లో ఒక ఎమోషనల్‌ పోస్ట్ ను పెట్టాడు.  

 “నా మొదటి సినిమా వచ్చి 18 ఏళ్ళు అయ్యింది. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో మొదటి నుంచి నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను, నా గుండె నిండా వారందరి పట్ల కృతజ్ఞత ఉందని, ఇన్నేళ్ళుగా నాపై వారందరు కురిపించిన ప్రేమకు రుణపడి ఉంటానని”  తెలియజేస్తూ బన్నీ తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ పెట్టాడు.

కాగా, మార్చి 28న దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తో చేసిన “గంగోత్రి” లో హీరోగా పరిచయమైన బన్ని, ఆ చిత్రం విడుదలకు ముందు తన‌ లుక్స్‌పై అప్పట్లో గుసగుసలు వినబడ్డాయి. వాటన్నింటిని అధిగమిస్తూ అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి అపారమైన అభిమానాన్ని, స్టైలిష్‌ స్టార్‌ బిరుదుని సొంతం చేసుకున్నాడు. యూత్‌ ఐకాన్‌గా నిలిచాడు. నాటి ‘గంగ్రోతి’ మొదలు నిన్నటి ‘అల వైకుంఠపురములో’ వరకు హీరో స్థాయి నుంచి స్టార్‌ హీరో స్టేటస్‌ను సంపాదించాడు.

 బన్నీ ‘అల వైకుంఠపురములో’,  సుకుమార్ ‘రంగస్థలం’ చిత్రాలు బ్లాక్‌ బస్టర్‌  కావడంతో ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రంగా వస్తున్న “పుష్ప” పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రం పాన్‌ ఇండియన్‌ మూవీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ( చదవండి : అల్లు అర్జున్‌ మల్టీప్లెక్స్‌.. ఓపెనింగ్‌ ఎప్పుడంటే! )

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top