Rajamouli RRR Movie: Alia Bhatt Gives Clarity On Rumours, Post Went Viral - Sakshi
Sakshi News home page

Alia Bhatt-RRR Rumours: అందుకే ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టులు డిలీట్‌ చేశా: ఆలియా క్లారిటీ

Mar 31 2022 4:59 PM | Updated on Mar 31 2022 5:37 PM

Alia Bhatt Gives Clarity On RRR Rumours - Sakshi

‘ఆర్‌ఆర్‌ఆర్‌’టీమ్‌పై బాలీవుడ్‌ భామ ఆలియా భట్‌ అసంతృప్తిగా ఉందని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమెకుస్క్రీన్‌ స్పేస్‌ తక్కువ ఇచ్చారని, అందుకే ప్రమోషన్స్‌కి కూడా హాజరుకాలేదని పుకార్లు వచ్చాయి. మరికొంతమంది అయితే.. కోపంతో గతంలో షేర్‌ చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టులను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి డిలీట్‌ చేయడంతో పాటు రాజమౌళిని అన్‌ఫాలో చేసిందని ప్రచారం చేశారు. తాజాగా ఈ పుకార్లపై ఆలియా స్పందించింది. తనకు ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌పై ఎలాంటి అసంతృప్తి లేదని, దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండంటూ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో ఆలియా ఓ లేఖను పోస్ట్‌ చేసింది. 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’టీమ్‌ పట్ల నేను అసంతృప్తిగా ఉన్నానని, పాత పోస్టులను కూడా డిలీట్‌ చేశానని నాపై పుకార్లు వచ్చాయి. దయచేసి ఇలాంటి తప్పుడు విషయాలను ప్రచారం చేయకండి. నేను ప్రతిసారి నా ఇన్‌స్టాలోని పాత పోస్టులను నా ప్రొఫెల్‌ గ్రిడ్‌ నుంచి తిరిగి మారుస్తాను. అందులో భాగంగానే నేను ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టులను మార్చాను. ఇలా యాదృచ్ఛితంగా జరిగిన సంఘటనల ఆధారంగా అంచనాలు వేసి తప్పుడు విషయాలను ప్రచారం చేయొద్దని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లాంటి గొప్ప చిత్రంలో పాలుపంచుకోవడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. సీత పాత్రని చాలా ప్రేమతో చేశాను. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఆర్‌ఆర్‌ఆర్‌ సంబంధించిన ప్రతి విషయంలోనూ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఈ వివరణ ఎందుకు ఇస్తున్నానంటే.. రాజమౌళితో పాటు ఆయన టీమ్‌ అంతా ఈ సినిమా కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డారు. వారి శక్తినంతా ధారబోసి ఓ మంచి చిత్రాన్ని అందించారు. ఇలాంటి గొప్ప చిత్రం పట్ల తప్పుడు విషయాలను ప్రచారం చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. అందుకే ఈ వివరణ ఇస్తున్నాను’ అంటూ ఆలియా చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement