సినిమాలు, రేసింగ్‌.. హీరో అజిత్‌ కీలక నిర్ణయం! | Ajith Says He Decided Stay Away From Movies When Racing Time, Comments Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

సినిమాలు, రేసింగ్‌.. హీరో అజిత్‌ కీలక నిర్ణయం!

May 17 2025 4:20 PM | Updated on May 17 2025 4:39 PM

Ajith Says He Decided Stay Away From Movies When Racing Time

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌(Ajith)కి రేసింగ్‌ అంటే ఎంత ఇష్టం అందరికి తెలిసిందే. రేజింగ్‌లో పాల్గొని ఇప్పటికే పలుమార్లు ప్రమాదానికి గురైనా కూడా ఆయన దాన్ని వదలడం లేదు. సినిమాల కంటే రేసింగే ఎక్కువ ఇష్టమని గతంలో చాలా సార్లు చెప్పారు. అంతేకాదు తాను యాక్సిడెంటల్‌ హీరో​ అని కూడా చెప్పుకుంటారు. ఒకనొక దశలో సినిమాలకు గుడ్‌బై చెప్పి పూర్తిస్థాయిలో రేసింగ్‌పై ఫోకస్‌ పెట్టబోతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. తాజాగా దీనిపై అజిత్‌ క్లారిటీ ఇచ్చాడు. సినిమాలు చేస్తూనే రేసింగ్‌లో పాల్గొంటానని, ఒకటి చేసేటప్పుడు మరోకదానికి బ్రేక్‌ ఇస్తానని చెప్పుకొచ్చాడు.

‘రేసింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో పాల్గొనాలంటే చాలా ఫిట్‌గా ఉండాలి. సినిమాలు చేస్తూ రేసింగ్‌లో పాల్గొనడం చాలా కష్టమైన పని.  కార్ల రేస్‌పై దృష్టిపెట్టినప్పుడు ముందు శారీరకంగా మారాలి. అందుకే సైక్లింగ్‌, స్విమ్మింగ్‌తో పాటు డైట్‌ ఫాలో అవుతా. గత ఎనిమిది నెలల్లో దాదాపు 42 కిలోల బరువు తగ్గాను. ఇలాంటి సమయంలో మళ్లీ సినిమాలు చేస్తే దానికి పూర్తి న్యాయం చేయలేకపోతున్నాను. అందుకే  ఓ నిర్ణయం తీసుకున్నాను. ఇకపై రేసింగ్‌ సీజన్‌ ఉన్నప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉంటా’అని ఆయన అన్నారు. ఇక రేసింగ్‌ సమయంలో ఆయనకు జరిగిన ప్రమాదాల గురించి మాట్లాడుతూ.. ‘సినిమాల్లో స్టంట్స్‌ చేసేటప్పుడు నాకు చాలా దెబ్బలు తగిలాయి.ఎన్నో సర్జరీలు జరిగాయి. అలా అని యాక్షన్‌ సినిమాలు వదిలేయలేం కదా? అదే విధంగా ప్రమాదాలు జరిగాయని రేసింగ్‌కు దూరం కాలేను. నా దృష్టిలో రెండు ఒక్కటే’ అన్నారు.

ఇక సినిమాల విషయాలకొస్తే.. ఇటీవ‌ల గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్నాడు అజిత్. అధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం రూ.200 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.త్వరలోనే తన 64వ సినిమా ప్రారంభం కాబోతుంది. దర్శకుడు ఎవరనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ధనుష్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో షూటింగ్‌ ప్రారంభం కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement