Aishwarya Rajinikanth Maid Reveals Why Did She Jewellery Theft From House - Sakshi
Sakshi News home page

Aishwarya Rajinikanth :'గొడ్డు చాకిరీ చేయించుకుంది.. అందుకే ఐశ్వర్య ఇంట్లో దొంగతనం చేశా' 

Apr 1 2023 10:44 AM | Updated on Apr 1 2023 11:16 AM

Aishwarya Rajinikanth Maid Reveals Why Did She Theft From House - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ ఇంట్లో కొన్ని రోజుల క్రితం భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. 60 సవర్ల బంగారు నగలు చోరీకి గురైయ్యాయని ఐశ్వర్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి పనిషి ఈశ్వరిని నిందితురాలిగా గుర్తించారు. ఈమెను అరెస్ట్‌ చేసి విచారించగా తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. అయితే తాను దొంగతనం చేయడానికి కారణం ఐశ్వర్యే అంటూ విస్తుపోయే సమాధానం ఇచ్చింది.

'నేను ఐశ్వర్య ఇంట్లో గొడ్డు చాకిరీ చేశాను. ఆమె చెప్పిన పనులన్నీ చేసేదాన్ని. అయితే ఐశ్వర్య దగ్గర బోలెడు డబ్బులు ఉన్నా నాకు రూ. 30వేల జీతమే ఇచ్చేవారు. ఆ డబ్బు ఒక కుటుంబం బతకడానికి సరిపోతుందా? అందుకే దొంగతనాలు చేయడం మొదలుపెట్టా. మొదట చిన్నచిన్న వస్తువులు దొంగిలించేదాన్ని. కానీ దొరికిపోలేదు. దీంతో ధైర్యం చేసి నగలు కూడా దొంగతనం చేశాను' అంటూ విచారణలో ఈశ్వరి చెప్పుకొచ్చింది.

ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏంటంటే.. ఐశ్వర్య చెప్పినదాని కంటే ఈశ్వరి ఇంట్లో ఇంకా ఎక్కవ బంగారమే దొరికింది. ఆమె ఐశ్వర్య ఇంటితో పాటు రజనీకాంత్‌, ధనుష్‌ ఇళ్లలో కూడా పనిచేసేదట. దీంతో ఆ నగలు అక్కడ దొంగిలించిందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement