సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న స్టార్‌ డైరెక్టర్‌ కూతురు? వైద్య వృత్తిలోకి ఎంటర్‌?

Aditi Shankar Shares Her Doctor Look - Sakshi

ప్రముఖ దర్శకుడు శంకర్‌ వారసురాలు అదితి శంకర్‌ ఇండస్ట్రీలో మంచి అవకాశాలే దక్కించుకుంటోంది. స్టార్‌ హీరో కార్తీకి జంటగా విరుమాన్‌ చిత్రంతో వెండితెరకు కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ తొలి మూవీతోనే ప్రశంసలను అందుకుంది. ఆ తర్వాత శివకార్తికేయన్‌ సరసన మావీరన్‌ చిత్రంలో నటించి మెప్పించింది. రెండు బ్లాక్‌బస్టర్‌ సినిమాలతో ఇండస్ట్రీలో మరింత దూసుకుపోయింది. వరుస అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలున్నట్లు తెలుస్తోంది.

డాక్టర్‌గా మారిన అదితి
అయితే అదితిని డాక్టర్‌గా చూడాలన్నది శంకర్‌ దంపతుల కోరిక అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె వైద్య విద్య కూడా పూర్తి చేసింది. కానీ తనకు నటన అంటే ఇష్టం ఉండటంతో హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తన ప్రయత్నంలో సక్సెస్‌ అయింది కూడా! తాజాగా ఈ బ్యూటీ డాక్టర్‌గా మారి షాకిచ్చింది. సర్జరీ చేయడానికి వైద్యులు కోట్‌ వేసుకుని, గ్లౌజులు ధరించి, తలకు క్యాప్‌ పెట్టుకుని ఎలాగైతే రెడీ అవుతారో అచ్చంగా అలాగే తయారైంది.

సినిమాలు మానేస్తుందా?
ఈ ఫోటోను 'డాక్టర్‌. A' అన్న క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసింది. ఇది చూసిన నెటిజన్లు 'డాక్టర్‌ ఎ' అంటే వైద్యురాలు అదితి శంకర్‌ అని అభిప్రాయపడుతున్నారు. అంటే సినిమాలకు గుడ్‌ బై చెప్పి వైద్యవృత్తి మీద ఫోకస్‌ చేయనుందా? అని అనుమానిస్తున్నారు. లేదంటే ఈ డాక్టర్‌ వేషం సినిమా కోసమా? అని డౌట్‌ పడుతున్నారు. రీల్‌ అయినా రియల్‌ అయినా అదితి డాక్టర్‌ అయితే పేషెంట్ల గుండె జారి గల్లంతవడం ఖాయం అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: అలాంటి వాళ్లు ఇండస్ట్రీకి రావొద్దన్న విశాల్‌.. కౌంటరిచ్చిన దర్శకుడు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top