
బాలీవుడ్ నటుడు, నిర్మాత మాన్ సింగ్‌ను నటి రుచి గుజ్జర్ చెప్పుతో కొట్టింది. 'సో లాంగ్ వ్యాలీ' అనే హిందీ చిత్రాన్ని మాన్ సింగ్ దర్శత్వం వహించడంతో పాటు ఆయనే నిర్మాతగా ఉన్నారు. ఆపై ఇదే చిత్రంలో కీలక పాత్రలో నటించారు. జులై 25న చిత్ర యూనిట్తో కలిసి ముంబైలోని సినీపోలిస్ థియేటర్‌కు మాన్ సింగ్ వచ్చారు. ఆ సమయంలో నటి రుచి గుజ్జర్ ఆవేశంతో తనకు చెల్లించాల్సిన డబ్బు ఇవ్వాలంటూ చెప్పుతో కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
నిర్మాత, నటుడు మాన్ సింగ్ తనకు రూ. 25 లక్షలు బాకీ ఉన్నాడని రుచి గుజ్జర్ పేర్కొంది. ఆ డబ్బు ఇవ్వాలంటూ అతనిపై చెప్పుతో దాడి చేసింది. ఈ క్రమంలో చెప్పు దాడి నుంచి తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నం చేయగా.. ఆమెను నిలువరించేందుకు చిత్ర సహ నిర్మాత కరణ్ అడ్డుపడ్డాడు. ఆ చిత్ర నిర్మాతలు గాడిదలపై కూర్చున్నట్లు చిత్రీకరించబడిని కొన్ని ప్లకార్డులను ఆమె ప్రదర్శించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. చాలా కాలంగా తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా తనను ఇబ్బంది పెడుతున్నాడని మాన్ సింగ్‌పై పోలీసులకు రుచి గుజ్జర్ ఫిర్యాదు చేసింది. మ్యూజిక్ ఆల్బమ్‌లకు సంబంధించి తనకు రావాల్సిన రెమ్యునరేషన్ కోసం ఆమె ఇలా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
నటి రుచి గుజ్జర్ ప్రధానంగా మోడలింగ్, మ్యూజిక్ వీడియోల ద్వారా బాలీవుడ్లో గుర్తింపు పొందింది. కొన్ని ప్రైవేట్ వీడియో సాంగ్స్లో నటించిన ఆమెకు పాపులారిటీ వచ్చింది. 2023 మిస్ హర్యానాగా నిలిచిన ఈ బ్యూటీ ఈ ఏడాది మే నెలలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో కూడిన నెక్లెస్ ధరించి అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేసింది.