విశాల్ సినిమాతో ఫేమ్.. హీరోయిన్ నిశ్చితార్థం | Actress Janani Iyer Engagement | Sakshi
Sakshi News home page

Janani Iyer: నిశ్చితార్థం చేసుకున్న 'వాడు వీడు' హీరోయిన్

Apr 18 2025 5:17 PM | Updated on Apr 18 2025 6:21 PM

Actress Janani Iyer Engagement

హీరోయిన్ గా పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న జనని అయ్యర్ నిశ్చితార్థం(Janani Iyer Engagement) చేసుకుంది. పలు తమిళ చిత్రాల్లో నటించిన ఈమె.. ఇప్పుడు సాయి రోషన్ అనే పైలట్ తో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇంతకీ జనని ఎవరు? ఏయే సినిమాలు చేసింది.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) 

తమిళనాడుకు చెందిన జనని అయ్యర్.. విశాల్ 'వాడు వీడు' సినిమాలో(Vaadu Veedu Movie) ఓ హీరోయిన్ గా చేసింది. ఇది తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి ప్రేక్షకులకు కాస్త పరిచయమే. దీని తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించింది. కాకపోతే అవి తెలుగులో డబ్ కాలేదు.

అయితేనేం అడపాదడపా సినిమాలు చేస్తున్న జనని.. ఇప్పుడు పెద్దల కుదిర్చిన పెళ్లికి రెడీ అయింది. ఏప్రిల్ 11న తన ఎంగేజ్ మెంట్ జరగ్గా.. తాజాగా ఆ ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. జంట చూడముచ్చటగా ఉంది. త్వరలోనే పెళ్లి ఎ‍ప్పుడు ఉండబోతుంది ఏంటనేది ప్రకటిస్తారు.

(ఇదీ చదవండి: ఓర్నీ'పుష్ప 2' మొత్తం గ్రాఫిక్సే.. వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్) 

Advertisement
 
Advertisement
Advertisement