బుల్లితెర నటి చారు అసోపా భర్తకు విడాకులిచ్చి కూతురితో ఒంటరిగా బతుకుతోంది. సింగిల్ పేరెంట్ అయిన తనకు ముంబైలో ఇల్లు దొరక్క, సరైన సంపాదన లేక.. రాజస్తాన్‌లోని బికనీర్‌లో పుట్టింటికి వెళ్లిపోయింది. నటనకు బ్రేక్ ఇచ్చి చీరల బిజినెస్ చేస్తోంది. పుట్టింట్లో ఉండిపోకుండా కొత్తిల్లు కట్టుకుని కూతురు జియానాతో కలిసి జీవిస్తోంది.
నటి కోసం వచ్చిన మాజీ మామ
తాజాగా చారు అసోపా (Charu Asopa)ను ఆమె మాజీ మామ కలిశాడు. బికనీర్‌లో తనింటికి తొలిసారి వెళ్లాడు. మనవరాలి బర్త్‌డే కోసం కానుకల్ని వెంటపెట్టుకుని వెళ్లాడు. మనవరాలికే కాకుండా మాజీ కోడలి కోసం కూడా గిఫ్టులు కొనుగోలు చేశాడు. మామ వస్తున్నాడని తెలిసి ఇంటిని అందంగా ముస్తాబు చేసింది చారు. విమానాశ్రయానికి వెళ్లి అతడికి సాదర ఆహ్వానం పలికింది. తర్వాత డిన్నర్ కోసం ప్యాలెస్‌కు తీసుకెళ్లింది. ప్యాలెస్‌లో నచ్చిన విందు ఆరగించాక.. అక్కడి ఫోక్ డ్యాన్సర్లతో కలిసి చారు, జియానా స్టెప్పులేశారు.

పెళ్లి- విడాకులు
బుల్లితెర నటి చారు అసోపా.. హీరోయిన్ సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్‌ను 2019లో గోవాలో పెళ్లి చేసుకుంది. వీరి దాంపత్యానికి గుర్తుగా కూతురు జియానా పుట్టింది. కానీ తర్వాత వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎంత సర్దుకుపోదామన్నా అవి తగ్గకపోగా, పెద్దవి కావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అలా 2023లో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న మొదట్లో ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు గుప్పించుకున్నారు. కోపావేశాలు చల్లారాక ఫ్రెండ్స్ అయిపోయారు. రాజీవ్, చారు, జియానా.. ఆ మధ్య నగరాలు, దేశాలు చుట్టేస్తూ సరదాగా గడిపారు. ఇప్పటికీ ఒక ఫ్యామిలీలా కలిసిమెలిసి ఉంటున్నారు.
చదవండి: శ్రీజ ఎలిమినేట్, కొత్త కెప్టెన్‌గా దివ్య.. గోడమీద పిల్లిలా భరణి!


