స్టార్ హీరో సూర్య దంపతుల మొత్తం ఆస్తి అన్ని కోట్లా? | Sakshi
Sakshi News home page

Suriya-Jyothika: సూర్య కంటే జ్యోతిక ఆస్తి ఎక్కువ? ఎవరి దగ్గర ఎంతంటే?

Published Wed, Mar 13 2024 10:30 AM

Actor Suriya And Jyothika Net Worth Details - Sakshi

మన హీరోల్లో చాలామంది ఇప్పుడిప్పుడే తెలుగు కాకుండా ఇతర భాషల్లో క్రేజ్ సంపాదిస్తున్నారు. అలాంటిది చాలా ఏళ్ల క్రితం నుంచి తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ హీరోగా సూర్య ఫేమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హీరో, నిర్మాతగా బ్లాక్ బస్టర్స్ కొడుతున్నాడు. ఇతడి భార్య జ్యోతిక కూడా రీఎంట్రీ ఇచ్చేసింది. దీంతో ఇద్దరూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే వీళ్ల ఆస్తుల వివరాలు ఇవేనంటూ కొన్ని నంబర్స్ బయటకొచ్చాయి.

కెరీర్ ప్రారంభంలో చాలా విమర్శలు ఎదుర్కొన్న సూర్య.. గజిని, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, 'సింగం' సిరీస్ చిత్రాలతో తెలుగులో స్టార్ హీరోల మించిన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.25-30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడట. అలా ఇతడి ఆస్తి దాదాపు రూ.206 కోట్ల వరకు ఉందని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?)

సూర్యతోనే కెరీర్ మొదట్లో హీరోయిన్‌గా పలు సినిమాలు చేసిన జ్యోతిక.. పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లయింది. ప్రస్తుతం వాళ్లిద్దరూ పెరిగి పెద్దవడంతో నటిగా మళ్లీ జర్నీ షురూ చేసింది. రీసెంట్‌గా హిందీ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయని ముంబయికి షిప్ట్ అయిపోయింది. ఇకపోతే ఈమె ఆస్తి రూ.331 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే సూర్య-జ్యోతిక మొత్తం ఆస్తి దాదాపు రూ.537 కోట్ల మేర ఉందని తెలుస్తోంది.

సూర్య-జ్యోతిక దంపతులకు చెన్నైలో ఓ ఖరీదైన ఇల్లు, ముంబయిలో రూ.70 కోట్లు విలువ చేసే బంగ్లా ఉన్నాయట. ఇక కార్ల విషయానికొస్తే.. రూ.1.38 కోట్లు విలువైన బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు, రూ.80 లక్షల ఆడీ క్యూ 7, రూ.61 లక్షల బెంజ్ కారు, రూ.1.10 కోట్ల విలువైన జాగ్వార్ కారు.. వీళ్ల దగ్గర ఉన్నాయని అంటున్నారు. తాజాగా ఈ ఆస్తుల వివరాలు బయటకొచ్చాయి. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: అభిమానితో దురుసు ప్రవర్తన? హీరో సూర్య తండ్రిపై విమర్శలు)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement