Aamir Khan: త్వరలోనే అమిర్‌ ఖాన్ ఇంట్లో పెళ్లి సందడి.. తేదీని ప్రకటించిన హీరో!

Aamir Khan announces daughter Ira Khan will marry Nupur Shikhare On January 3 - Sakshi

బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ఇంట్లో త్వరలోనే పెళ్లి జరగనుంది. ఇప్పటికే ఆయన కూతురు ఐరా ఖాన్‌కు తన ప్రియుడితో ఎంగేజ్‌మెంజ్‌ జరిగిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా  నుపుర్ శిఖరేతో డేటింగ్‌లో ఉన్న ఐరా గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకుంది. ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం పాల్గొన్నారు. అయితే ఎంగేజ్‌మెంట్‌ జరిగి దాదాపు ఏడాది పూర్తవుతున్నా పెళ్లి తేదీపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో ఐరా పెళ్లి ఎప్పుడు జరుగుతుందంటూ అమిర్ ఖాన్ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఆమె పెళ్లి జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

(ఇది చదవండి: రకుల్ భామకు బాయ్‌ఫ్రెండ్‌ స్పెషల్ విషెస్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!)

అయితే తాజాగా తన కుమార్తె పెళ్లి తేదీపై క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ హీరో. అభిమానుల ఊహగానాలకు తెరదించుతూ అమిర్ ఖాన్ పెళ్లి తేదీని వెల్లడించారు. జనవరి 3, 2024న నుపుర్ శిఖరేను ఇరా ఖాన్ వివాహం చేసుకోనున్నట్లు అమీర్ ఖాన్ తెలిపారు. ఐరా కష్టకాలంలో నుపుర్ తనకు అండగా నిలిచినట్లు అమీర్ వెల్లడించారు. నుపుర్ ఇప్పటికే మా ఫ్యామిలీతో బాగా కలిసిపోయాడని పేర్కొన్నారు. అంతేకాకుండా ఐరా పెళ్లి రోజు తాను చాలా ఎమోషనల్ ‍అవుతాననని అన్నారు. 

అమిర్ మాట్లాడుతూ..'ఐరా జనవరి 3న పెళ్లి చేసుకోబోతోంది. ఆమె ఎంచుకున్న అబ్బాయి చాలా మంచివాడు. ఐరా డిప్రెషన్‌తో పోరాడుతున్నప్పుడు నుపుర్ అండగా నిలిచాడు. మానసికంగా ఆమెకు దృఢంగా మార్చాడు. ఐరా, నుపూర్‌లు కలిసి చాలా సంతోషంగా ఉన్నారు. వారు ఒకరినొకరు చాలా బాగా చూసుకుంటారనే నమ్మకం ఉంది.' అని అన్నారు. కాగా.. ఐరా.. అమీర్ ఖాన్  మాజీ భార్య రీనా దత్తా కుమార్తె. ఇరా, నుపుర్ 2020లో డేటింగ్ ప్రారంభించి.. తన రిలేషన్‌ను 2021లో అఫీషియల్‌గా చేసుకున్నారు. ఇటీవలే తన కూతురితో కలిసి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు దయచేసి నిపుణుల సలహాలు తీసుకోమని అమిర్ సూచించారు. 

(ఇది చదవండి: నిద్రలోనూ అవే కలలు వస్తున్నాయి.. అయినా తప్పకుండా చేస్తా: రాఘవ లారెన్స్)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top