Tees Maar Khan Movie: నేను బిగ్ హిట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ను కాదు, అయినా

Aadi Sai Kumar Comments On Tees Maar Khan - Sakshi

Aadi Sai Kumar Comments On Tees Maar Khan: స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "తీస్ మార్ ఖాన్". విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుంది. 'నాటకం' వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్‌ కల్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమా పట్ల ఆసక్తి పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. 

హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ... ''ఈ మధ్య నేను కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు చేశాను కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు చేశాను కానీ పక్కా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చేసి చాలా రోజులు అయింది అని అనుకుంటున్న సమయంలో దర్శకుడు  కల్యాణ్ ఈ కథ చెప్పడం జరిగింది. విన్న వెంటనే ఈ కథకు మంచి స్పాన్ ఉందని, ఖర్చు కూడా ఎక్కువ అవుతుందనుకున్నాను. అయితే మా నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి గారు ఖర్చుకు వెనుకడకుండా నిర్మించారు. ఇప్పటి వరకు మేము అన్ని పాటలు ఆన్ లైన్ లోనే రిలీజ్ చేశాం. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా కోసం నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఇందులో శ్రీకాంత్ అయ్యాంగార్, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ ,పూర్ణ వంటి మంచి కాస్టింగ్ పెట్టుకున్నారు. ప్రతిసారి సాయి కార్తీక్  నాకు మంచి మ్యూజిక్ ఇస్తారు. డి. ఓ. పి. గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమా డేట్ అనౌన్స్ చేసిన తరువాత  థియేటర్స్ కు జనాలు వస్తారా రారా అని భయముండేది. అయితే బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలు అందరికీ మంచి హోప్ ని ఇచ్చాయి. ఆగస్టు 19 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ  ఆదరించి  ఆశీర్వాదించాలి'' అని తెలిపారు. 

''ఇందులో ప్రతి 15 నిమిషాలకు ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. ఇంతకుముందు నేను బిగ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ను కాదు, అయినా నేను ఈ కథ చెప్పగానే  నన్ను నా కథను నమ్మి ఇంత పెద్ద కాస్టింగ్ ఇచ్చారు. హీరో ఆది గారికి ఈ కథ నచ్చుతుందా లేదా అని టెన్షన్ పడ్డాను. తను నాకు ఫుల్ సపోర్ట్ చేశాడు. సాయి కార్తిక్ గారు నేను అనుకున్న దానికంటే  మంచి అవుట్ పుట్ ఇచ్చారు. శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్ బాగుంటుంది. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు'' అని డైరెక్టర్‌ కల్యాణ్‌ జి గోగణ పేర్కొన్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top