
గతంలో యూట్యూబ్‌లో వైరల్ అయిన 'ఆ గ్యాంగ్ రేపు' షార్ట్ ఫిల్మ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత 'ఆ గ్యాంగ్ రేపు 2' పేరుతోనూ షార్ట్ ఫిల్మ్ తీశారు. ఇప్పుడు ఈ టీమ్ నుంచి మూడో భాగం రాబోతుంది. త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
దర్శకుడు యోగి తొలి ఫీచర్ ఫిల్మ్ 'లవ్ యూ టూ' నేరుగా ఓటీటీలో రిలీజై ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈసారి 'ఆ గ్యాంగ్ రేపు 3'.. దర్శకుడిగా మరింత గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నారు. నరేన్ అన్నసాగరం, ప్రీతి సుందర్ హీరో హీరోయిన్లుగా నటించారు. నోక్షియస్ నాగ్స్ నిర్మించారు. కంటెంట్ ట్రైలర్ జూలై 16న విడుదల కానుంది. పూర్తి వివరాలు త్వరలో బయటపెట్టనున్నారు.