పూల పండుగకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

పూల పండుగకు వేళాయె..

Oct 10 2026 7:56 AM | Updated on Oct 10 2026 7:56 AM

సంగారెడ్డి క్రైమ్‌/హత్నుర (సంగారెడ్డి): తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే అతి పెద్ద పండగ బతుకమ్మ. మహిళలు ఎంతో సంబురంగా జరుపుకునే గొప్ప వేడుక. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పూల సింగిడి శనివారం నుంచి మొదలు కానుంది. దీంతో పల్లెలు, పట్టణాలు ఆడి పాడనున్నాయి. బతుకమ్మ వచ్చిందంటే ప్రతి ఇంట్లో పూల పరిమళాలు వెదజల్లుతాయి. ఆశ్వయుజ పాడ్యమికి ముందు వచ్చేది పితృ అమావాస్య. ఆ రోజును పెత్తరమాసగా జరుపుకుంటాం. అదే రోజు పేర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఈ కాలంలో లభించే వివిధ రకాల గునుగు పూలు, తంగేడు, బంతి, చామంతి, గోరింటా ఇలా తిరోక్కపూలతో బతుకమ్మను పేరుస్తారు. మధ్యలో గౌరవమ్మను పెట్టి అమ్మవారిగా కొలుస్తారు. ఆటపాటలతో గౌరమ్మను కొలుస్తారు. పెరుగన్నం, నువ్వుల అన్నం వంటి ఐదు రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

తొమ్మిది రోజుల విశేషాలు

తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ముందు రోజు కోసిన పూలను నీళ్లలో వేసి మరునాడు బతుకమ్మ అలంకరణకు వాడడంతో అలా పిలుస్తారు. రెండో రోజు అటుకుల, మూడో రోజు ముద్దపప్పు, నాలుగో రోజు నాన బియ్యం, ఐదో రోజు అట్ల, ఆరో రోజు అమ్మవారు అలకతో ఉంటారని బతుకమ్మ ఆడరు. ఏడో రోజు వేపకాయల, ఎనిమిదో రోజు వెన్నముద్దల, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆడతారు. చెరువుల్లో, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి ఒకరికొకరు వాయినం ఇచ్చి పుచ్చుకుంటారు.

తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ సంబురాలు

నేడు ఎంగిలిపూలతో మొదలు

ఆడిపాడనున్న ఆడబిడ్డలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement