వృద్ధుల సంక్షేమానికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

వృద్ధుల సంక్షేమానికి కృషి చేయాలి

Oct 10 2026 7:56 AM | Updated on Oct 10 2026 7:56 AM

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: వృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అలాగే వారి అనుభవాలను సమాజాభివృద్ధికి ఉపయోగించాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు వృద్ధులకు తగిన ఆదరణ, ప్రేమాభిమానాలు పంచాలన్నారు. ఆరోగ్య సమస్యలను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి రుబినాబేగం మాట్లాడుతూ.. వృద్దుల హక్కుల పరిరక్షణ, వారి గౌరవప్రదమైన జీవనానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ నగేశ్‌ మాట్లాడుతూ వృద్ధుల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అనంతరం భూభారతిపై కలెక్టర్‌ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడే సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, వీబీజీరాంజీ, తాగునీటి ఎద్దడి, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా వైద్యాధికారి గణేశ్వర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, హౌసింగ్‌ పీడీ మాణిక్యం, మెదక్‌ ఆర్డీఓ రమాదేవి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి హేమాభార్గవి, జిల్లా అధికారులు, వృద్ధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement