రామాయంపేట(మెదక్)/నర్సాపూర్ రూరల్: సీఎంఆర్ బకాయి పడిన జిల్లాలోని రెండు రైస్ మిల్లులపై సోమవారం పౌర సరఫరాల శాఖ అధికారులు కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌లో ఉన్న విజయ దుర్గా రైస్‌మిల్లు 2022–23 రబీ సీజన్‌లో 290 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ ఇవ్వకుండా అమ్ముకున్నారు. ఈమేరకు రైస్‌మిల్లు యజ మాని రూ.65 లక్షల బకాయిలు చెల్లించకపోవడంతో కేసు నమోదు చేసి రైస్‌మిల్లును సీజ్ చేశానే. నర్సాపూర్ మండలం నారాయణపూర్‌లోని ఏకే ట్రేడర్స్ బిన్నీ రైస్ మిల్లు 2024–25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 522 మెట్రిక్ టన్నుల ధాన్యం లెక్కలు చూపలేదు. దీంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి రైస్‌మిల్లును సీజ్ చేశారు. ఈ మిల్లు యజమానులు రూ. 1.52 కోట్లు బకాయలు చెల్లించాల్సి ఉన్నట్లు ఆశాఖ అధికారులు తెలిపారు.


