రజకుల సంక్షేమానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

రజకుల సంక్షేమానికి పెద్దపీట

Oct 6 2026 8:31 AM | Updated on Oct 6 2026 8:31 AM

మెదక్‌జోన్‌: రజకులు సంక్షేమానికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే రోహిత్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన రజక మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రజకుల కోసం పట్టణ పరిధిలో ఎకరం ప్రభుత్వం స్థలం ఇవ్వడంతో పాటు భవన నిర్మాణానికి నిధులు సమకూర్చుతానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక అన్నివర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంద ని చెప్పారు. గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నేతలు గాలి మాటలు తప్ప చేసిందేమి లేదన్నారు. అనంతరం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. సమాజంలో నిస్వార్థ సేవకులు రజకులేనని కొనియాడారు. రజక ఫెడరేషన్‌ చైర్మన్‌ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. కులవృత్తిని నమ్ముకుని జీవనం సాగించే వారిలో అత్యంత వెనుకబడిన వారు రజకులేనని అన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షు డు రమణ, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కానుగ రాధిక, వైస్‌ చైర్మన్‌ నరేశ్‌గౌడ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, రజక సంఘం నేతలు శ్రీనివాస్‌, సంపత్‌, పట్టణ అధ్యక్షుడు మల్లేశం, శివ, వేణు, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రోహిత్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement