రిజిస్ట్రేషన్ మాత్రం 1.39 లక్షల ఎకరాలకే..
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 3,40,342 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు. అందులో 2,08,459 ఎకరాల్లో సన్నాలు పండించారు. కాగా, ఈ వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం 7 రకాల సన్నాలకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని పేర్కొంది. ఆ విత్తనాలను కొనుగోలు చేసిన డీలర్ల వద్ద ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. కాగా, జిల్లావ్యాప్తంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చింది మొత్తం కలిపి 1,39,771 ఎకరాలు మాత్రమే రికార్డుల్లో నమోదైంది. ఈ లెక్కన ఇంకా 68,688 ఎకరాలు తక్కువగా వస్తోంది.
బోనస్ అందేనా..?
ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ ఇస్తుందనే ఆశతో రైతులు సన్న వడ్లను సాగు చేశారు. అయితే ఈ సీజన్‌లో నారుమళ్లు (తుకాలు) పోశాకనే 7 రకాలు సాగు చేసిన సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికే 70 శాతం మంది నారుమల్లు పోశారు. వర్షాకాలం జూన్‌లో ప్రారంభం అవుతుండగా, జూలై 2వ వారంలో ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలస్యంగా ప్రకటించింది. అప్పటికే పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది.
పెట్టుబడి అధికం
దొడ్డురకం వరితో పోలిస్తే సన్నాల సాగుకు అన్నిరకాల పెట్టుబడులు అధికమనే చెప్పాలి. దొడ్డురకం 120 రోజుల్లో పంట చేతికందితే, సన్నాలు 145–150 రోజులు అవుతుంది. నీటితడులు అధికంగా పెట్టాలి. విత్తన ధరలు అధికమే, తెగుళ్లు సైతం అధికంగా వస్తాయి. దీంతో మందులను 3–4 సార్లు పిచికారీ చేయాల్సి వస్తోంది. ఇన్నిరకాల ఇబ్బందులు తట్టుకొని సన్నవడ్లను సాగు చేస్తే తీరా పంట చేతికందే సమయంలో బోనస్ వస్తోందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
గుర్తింపునకు సిబ్బంది
ప్రభుత్వం ప్రకటించిన 7 రకాల సన్న ధాన్యాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం బీఎస్సీ, డిప్లొమా అగ్రికల్చర్ చదివిన అభ్యర్థులను రెండు నెలల కాలానికి ఔట్‌సోర్సింగ్ పద్ధతిన ఎంపిక చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 518 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా, ఒక్కో కేంద్రానికి ఒక్కో వ్యక్తికి నియమించేందుకు ఎంపిక చేస్తున్నారు. వారు నిర్ధారిస్తేనే రూ.500 బోనస్ అందుతుందని అధికారులు చెబుతున్నారు.
చందాపూర్‌లో సన్న వరి సాగు
జిల్లాలో 2.8 లక్షల ఎకరాల్లో పంట
గందరగోళంగా
సన్నాల సాగు
ఆందోళనలో అన్నదాతలు
రికార్డులకెక్కని మరో 69 వేల ఎకరాలు
ఈఏడాది సన్నాల సాగు గందరగోళంగా మారనుందా..? అంటే అధికారిక లెక్కలు చూస్తుంటే అవుననే చెప్పాలి. ప్రభుత్వం ప్రకటించిన 7 రకాల సన్నాలతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన వాటికి మాత్రమే రూ.500 బోనస్ లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. కానీ జిల్లాలో 2.8 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేయగా, విత్తన డీలర్లు రిజిస్ట్రేషన్ చేసిన 7 రకాల సన్నాలతో పాటు రైతులు ఇచ్చిన సెల్ఫ్ డిక్లరేషన్ కలిపి 1.39 లక్షల మాత్రమే రికార్డుల్లో ఉంది. ఈలెక్కన మరో 69 వేల ఎకరాలకు బోనస్ అందడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
– మెదక్‌జోన్


