క్యాసారం.. కన్నీటిసంద్రం | - | Sakshi
Sakshi News home page

క్యాసారం.. కన్నీటిసంద్రం

Oct 4 2026 7:20 AM | Updated on Oct 4 2026 7:20 AM

● అనంతగిరి బస్సు ప్రమాదంలో

ముగ్గురి మృతి

● బంధువు అంత్యక్రియలకు వెళ్తుండగా దుర్ఘటన

పటాన్‌చెరు టౌన్‌: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం క్యాసారం కన్నీటి సంద్రమైంది. వికారాబాద్‌ జిల్లా అనంతగిరి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్‌ జిల్లా దారూర్‌ మండలం చింతకుంటకు చెందిన నారాయణరెడ్డి నడుంనొప్పి భరించలేక శుక్రవారం ముత్తంగి (పటాన్‌చెరు మండలం) వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. అంత్యక్రియల కోసం క్యాసారం గ్రామానికి చెందిన బంధువులు ప్రైవేట్‌ బస్సులో చింతకుంటకు శనివారం ఉదయం బయలుదేరారు. ఈ క్రమంలో అనంతగిరి ఘాట్‌రోడ్డులో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 52 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లికి చెందిన ప్రమీల (52), క్యాసారం గ్రామానికి చెందిన అత్తెల్లి యాదమ్మ (52), పద్మ (55), బీరంగూడం పద్మమ్మ (50) మృతిచెందగా.. 32 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి వికారాబాద్‌ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేరుకొని మృతుల కుటుంబాలను ఓదార్చారు.

బాధితులకు ఎమ్మెల్యే అండ

బస్సు ప్రమాదంలో గాయపడి వికారాబాద్‌లోని ఈషా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్యాసారం గ్రామానికి చెందిన క్షతగాత్రులను ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు ఆస్పత్రి యాజమాన్యానికి రూ.2 లక్షలు చెల్లించారు. బాధితులకు అవసరమైన వైద్య ఖర్చులను తానే భరిస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement