చేగుంట(తూప్రాన్): రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర రైతు సంఘం కోషాధికారి మూడ్ శోభన్ అన్నారు. మంగళవారం తెలంగాణ రైతు సంఘం మూడో మహాసభను వడియారంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ఇంకా పూర్తి కాలేదన్నారు. రైతు భరోసా నిధులను పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందించడం లేదని ఆరోపించారు. నకిలీ పత్తి విత్తనాలను అరికట్టడంలోనూ విఫలమైందన్నారు. రైతులను పట్టించుకోకుంటే గత బీఆర్‌ఎస్ లాగే కాంగ్రెస్‌ను ఇంటికి పంపడం ఖాయమన్నారు. అలాగే పెంచిన ఎరువుల ధరలను కేంద్రం తగ్గించా లని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మీనర్సయ్య, కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, ఉపసర్పంచ్ రఫీ, నాయకులు భాస్క ర్, దివాకర్, సాయి, లచ్చాగౌడ్, రైతులు పాల్గొన్నారు.


