సత్వర న్యాయం అందించాలి | - | Sakshi
Sakshi News home page

సత్వర న్యాయం అందించాలి

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

ఎస్పీ శ్రీనివాసరావు

హవేళిఘణాపూర్‌(మెదక్‌): నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మెదక్‌రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో వార్షిక తనిఖీలో భాగంగా పలు రికార్డులు పరిశీలించారు. కేసుల గురించి ఆరా తీశారు. అలాగే స్టేషన్‌ డైరీలు, పెండింగ్‌ కేసుల పురోగతి, సిబ్బంది పనితీరును సమగ్రంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్‌లో రికార్డులు పెండింగ్‌లో ఉండకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. నిష్పక్షపాత విధుల ద్వారానే ప్రజల విశ్వాసాన్ని పొందవచ్చని అన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను పరిష్కరించేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు గాను ప్రతీ రోజు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఎస్పీ వెంట మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌, సీఐలు జార్జ్‌, సందీప్‌రెడ్డి, ఎస్‌ఐ లింగం, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement