నాణ్యమైన సరుకులు అందించండి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన సరుకులు అందించండి

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

మెదక్‌ కలెక్టరేట్‌: పాఠశాలలు, కళాశాలలకు నాణ్యమైన కూరగాయలు, ఇతర సరుకులు అందించాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి నిర్వహణ టెండర్లు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెండర్లు పొందిన వారు నాణ్యమైన కూరగాయలు, చికెన్‌, మటన్‌, ఇతర సరుకులు అందించాలని సూచించారు. అలాగే శానిటేషన్‌ ప్రక్రియ సైతం సక్రమంగా నిర్వహించాలన్నారు. టెండర్లు పారదర్శకంగా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ఆర్సీఓ వీరేశం, డీసీఓ హరిబాబు, ప్రిన్సిపాల్స్‌, కమిటీల సభ్యులు, టెండర్‌దారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement