తెలంగాణ చైతన్యానికి స్ఫూర్తి సిద్దిపేట | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ చైతన్యానికి స్ఫూర్తి సిద్దిపేట

Apr 8 2026 7:44 AM | Updated on Apr 8 2026 7:44 AM

నందిని సిధారెడ్డి

సిద్దిపేటఎడ్యుకేషన్‌: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్‌ కళాశాల ఎంతోమంది గొప్ప వ్యక్తులను, ఉద్యమ నాయకులను, గాయకులను, కళాకారులను అందించిందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి అన్నారు. కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆన్‌లైన్‌ జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేటకు కాపురాజయ్య, వేముగంటి నరసింహాచార్యులు రెండు కళ్లలాంటి వారిని అందించి తెలంగాణ చైతన్యానికి సిద్దిపేట మూలకందంగా నిలిచి నేటి యువతకు ప్రేరణగా నిలిచిందన్నారు. యవతరం పరిశోధానసక్తిని పెంపొందించుకుని జిల్లా కళలు, సంస్కృతి, చరిత్రను పరిరక్షించుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సునీత మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో విశేషమైన కృషి చేస్తూ సాహిత్య అకాడమీ అవార్డు పొంది సిధారెడ్డి సిద్దిపేటకు వన్నె తెచ్చారని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement