మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని ప్రయాణికుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ డీఎం సురేఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 7842651592 నంబరుకు ఫోన్ చేసి ఆర్టీసీకి సంబంధించిన ఏమైనా సమస్యలు తెలియజేయాలని డీఎం తెలిపారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
అసంపూర్తి పనులకు
నిధులు మంజూరు
ఎమ్మెల్యే సునీతారెడ్డి
శివ్వంపేట(నర్సాపూర్): అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. మంగళవారం మండల నాయకులు హైదరాబాద్‌లో ఆమెను కలిశారు. ఈ సందర్భంగా చండీ గ్రామం వద్ద రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయిన విషయం ఎమ్మెల్యే దృష్టికి బీఆర్‌ఎస్ నాయకులు తెచ్చారు. అందుకు ఆమె స్పందిస్తూ తూప్రాన్ హైవే చండీ బస్టాండ్ నుంచి 1500 మీటర్ల అసంపూర్తి రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు అయినట్లు, అందుకు సంబంధించి పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నవాబుపేట సర్పంచ్ అశోక్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు మల్లారెడ్డి, అంజిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాంరెడ్డి, తదితరులు ఉన్నారు.
పేదలకు మెరుగైన వైద్యం
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య
అల్లాదుర్గం(మెదక్): పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య పేర్కొన్నారు. మంగళవారం అల్లాదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరాన్ని సందర్శించారు. జెడ్పీ పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి, అనంతరం ఎంపీపీ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య కేంద్రాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రోగులకు వైద్యంతో పాటు, మందులను అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, తహసీల్దార్ మల్లయ్య, ఎంపీఓ ప్రభకర్ , డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మస్తుగా నిధులు
ప్రణాళికబద్ధంగా పనులు చేయండి
డీపీఓ యాదయ్య
యువతకు విదేశీ
ఉపాధి అవకాశాలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): నిరుద్యోగ మైనారిటీ యువత విదేశీ ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అఽధికారి నాగరాజమ్మ మంగళవారం పేర్కొన్నారు. రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సంస్థ, శిక్షణ, ఉపాధి కార్యక్రమంలో భాగంగా మైనారిటీ నిరుద్యోగ యువతకు విదేశాలలో వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా, ఒమన్, జర్మనీ, ఖతర్, గ్రీస్‌లలో పురుషులకు, మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జిల్లా మైనార్టీ సంక్షేమఽశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.


