నర్సాపూర్: సింగూర్ ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించినందున ప్రభుత్వం రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేసేందుకు రెండేళ్ల పాటు క్రాప్ హాలిడే ప్రకటించారని తెలిపారు. ప్రాజెక్టు కింద చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, వారికి పరిహారం అందచేసి ఆదుకోవాలన్నారు. కాగా చిన్నఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంచడంతో పాటు మరమ్మతులు చేపట్టేందుకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా, ఇప్పటివరకు పనులు చేపట్టలేదన్నారు. ఇప్పటికై నా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దరఖాస్తులకు
నేడు ఆఖరు
మెదక్ కలెక్టరేట్: స్వయం ఉపాధి సబ్సిడీ పథకాలను జిల్లాలోని అర్హులైన షెడ్యూల్డ్ కులాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు నేడే ఆఖరి రోజు అని తెలిపారు. జిల్లాలో 2025–26 వార్షిక ప్రణాళిక అమలు చేసేందుకు రూ.236.60 లక్షలతో 249 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు చెప్పారు. 119 ఈవీ ద్విచక్ర వాహ నాలు, 59 ఈవీ ఆటోలు, రైతులకు సోలార్ పంపులు అందజేయడం జరుగుతుందన్నారు. అర్హత, ఆసక్తి గల ఎస్సీ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


