రైతు భరోసా నిధులు విడుదల
● మొదటి విడతలో రూ.110.45 కోట్లు విడుదల
మెదక్‌జోన్: ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరో సా నిధులు విడుదల చేసింది. తొలుత ఎకరం వరకు ఉన్న రైతులకు నేటి నుంచి ఖాతాల్లో జమ కానుంది. జిల్లాలో 3.65 లక్షల ఎకరాల సాగు భూములు ఉండగా, ఈ ఏడాది కొత్తగా మరో 10,694 ఎకరాల పార్ట్(బీ) భూములకు పట్టాలు అందజేశారు. దీంతో మొత్తం 3,75,694 ఎకరాలకు చేరుకుంది. ఎకరాకు రూ.6000 చొప్పున, మొత్తం 225.41 కోట్లు అవసరం కానున్నాయి. మూడు విడతల్లో ఈ నిధులను కర్షకుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొదటి విడతలో 1,84,084 ఎకరాలకు గానూ రూ.110.45 కోట్లు విడుదలయ్యాయి. మిగితా 1,91,610 ఎకరాలకు మరో రెండు విడతల్లో నిధులు విడుదల చేయనున్నారు. కాగా యాసంగి పనులు జనవరి నుంచి ప్రారంభం కాగా, ప్రభుత్వం మూడు నెలల అనంతరం పెట్టుబడి సాయం విడుదల చేసింది. మిగితా రెండు విడతలు ఏప్రిల్‌లో అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇదిలా ఉండగా 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, అదే ఏడాది వానాకాలంలో ఎకరాకు రూ. 6 వేల చొప్పున ఇచ్చింది. 2024 వానాకాలంలో రైతు భరోసా ఇవ్వలేదు. ఈ ఏడాది యాసంగికి సంబంధించి ప్రస్తుతం నిధులు విడుదల చేసింది.
ముక్క తగ్గనంటోంది.. ముద్ద దిగనంటోంది
● రూ.360కి చేరిన కిలో చికెన్
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
రామాయంపేట(మెదక్): బీజేపీ బలోపేతం దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయా లని పార్టీ మూడు జిల్లాల ఇన్‌చార్జి రంజిత్ మోహన్ పిలుపునిచ్చారు. రామాయంపేటలో కొనసాగుతున్న పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమస్యలపై ప్రజలతో కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజ లకు వివరించి వారిని చైతన్యపర్చాలన్నారు. పదేళ్లలో మోదీ ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారని, యువతను పార్టీలోకి ఆహ్వానించాలని రంజిత్ మోహన్ సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సీనియర్ నాయకులు వెల్ముల సిద్దరాంలు, నవాత్ రాజేంద్రప్రసాద్, ఆకుల రమేశ్, పోలీస్ దేవెందర్, పార్టీ మండలాధ్యక్షుడు నవీన్‌గౌడ్, పట్టణాద్యక్షుడు అవినాశ్‌రెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అద్యక్షుడు సత్యం, అక్కన్నపేట సర్పంచ్ యాదగిరి పాల్గొన్నారు.


