నంగునూరు(సిద్దిపేట): సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం, రైతు భరోసా నిధుల విడుదల, రిఫైనరీ యూనిట్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన సీఎంకు జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
పటాన్‌చెరుటౌన్: స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్‌సింగ్ ఆశయాల సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కా రాములు పిలుపునిచ్చారు. భగత్‌సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని శ్రామిక్ భవన్ నుంచి బీరంగూడ కమాన్ వరకు తలపెట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ...భగత్‌సింగ్ తన 23 సంవత్స రాల కాలంలోనే దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ధీరుడని గుర్తు చేశారు. 1907 లో జన్మి ంచి, 1931 మార్చి 23 న ఉరి తీయబడ్డారన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు


