2,650 మంది రైతుల తరలింపు | - | Sakshi
Sakshi News home page

2,650 మంది రైతుల తరలింపు

Mar 22 2026 1:33 AM | Updated on Mar 22 2026 1:33 AM

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన రైతు ఉత్సవాల’ కార్యక్రమంలో జిల్లా రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. నేడు సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్‌రెడ్డి ఆయిల్‌ఫామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు జిల్లా పరిధిలోని 21 మండలాలకు చెందిన 2,650 మంది రైతులను 53 బస్సుల ద్వారా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.

నేడు విద్యుత్‌ సరఫరాలో

అంతరాయం

పెద్దశంకరంపేట(మెదక్‌): మండలంలోని 33 కేవీ సబ్‌స్టేషన్‌ పరిధిలో నూతన ఫీడర్‌ విస్తరణలో భాగంగా ఆదివారం విద్యుతత్‌్‌ సరఫరా లో అంతరాయం ఉంటుందని ఏఈ శ్యాంసుందర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చెట్ల తొలగింపు, మరమ్మతుల కారణంగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఈవిషయాన్ని ప్రజలు గమనించి, సహకరించాలని కోరారు.

24న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రజాసమస్యలపై ఈనెల 24న కలెక్టర్‌ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య తెలిపారు. శనివారం మెదక్‌లోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో అనేక గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభం కాలేదన్నారు. పని ప్రారంభించిన చోట కూలీలకు సరైన డబ్బులు రావడం లేదన్నారు. ధర్నాకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు నర్సమ్మ, మల్లేశం, బాలమణి, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి

డీసీసీ ఉపాధ్యక్షుడు యాదగిరి

రామాయంపేట(మెదక్‌): కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తానని డీసీసీ ఉపాధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికై న చింతల యాదగిరి అన్నారు. శనివారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై నమ్మకంతో పార్టీ పెద్దలు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే రోహిత్‌, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లావణ్య, కౌన్సిలర్‌ నాగరాజుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

బీహెచ్‌ఈఎల్‌ నుంచి గోవాకు బస్సు సర్వీసులు

పటాన్‌చెరు: బీహెచ్‌ఈఎల్‌ డిపో నుంచి కుక్కే సుబ్రహ్మణ్యస్వామి, ఉడుపి, మురుడేశ్వర, గోకర్ణ మీదుగా 25వ తేదీన గోవాకు సర్వీస్‌ నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ మోహన్‌రావు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వీకెండ్‌లలో గోవాకు ఒక్కరి రూ.6,150 టికెట్‌ ఉంటుందన్నారు. అదేవిధంగా ఒక కాలనీలో కనీసం 30మంది విహారయాత్రలకు, పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బీఓసీ కింద బస్సులు నడపనున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకోసం 9063401072 సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement